అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును తెలుగుదేశంపార్టీ వెలేసిందా ? ఇపుడిదే అంశంపై  రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. మూడు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో టిడిపి  ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. మిగిలిన వాళ్ళ విషయం ఎలాగున్నా పార్టీ ఘోర పరాజయం ప్రభావం మాత్రం కోడెలపై తీవ్రంగా పడినట్లే కనిపిస్తోంది.

 

 పార్టీ ఓడిపోవటం ఒక ఎత్తైతే కోడెల కూడా ఓడిపోవటం మరో ఎత్తు. దాంతోనే ఇంకే నేతకు ఎదురుకానీ అవమానాలు, సమస్యలు కోడెలకు మాత్రమే ఎదురవుతున్నాయి. అఫ్ కోర్స్ ఇందుకు కోడెల స్వయంకృతం కూడా ఉందనుకోండి అది వేరే సంగతి. కోడెలకు జరుగుతున్న అవమానాలపై పార్టీ నేతలెవరూ కనీసం మాట మాత్రంగా కూడా సానుభూతి చూపటం లేదు. అనధికారికంగా అందిన ఆదేశాల వల్లే నేతలందరూ కోడెలకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం.

 

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పార్టీ నేతలు దాదాపు కోడెలతో మాట్లాడటం లేదట. అందుకనే నేతలందరూ కోడెలను వెలేశారా అనే అనుమానాలు మొదలయ్యాయి. అసెంబ్లీ సమావేశాల్లో ఫిరాయింపులపై జగన్మోహన్ రెడ్డి మొదలుకుని మంత్రులు, ఎంఎల్ఏలందరూ కోడెలపై విరుచుకుపడ్డారు. అయితే సభలోనే ఉన్న చంద్రబాబు కానీ ఇతర సభ్యులు కానీ ఒక్కరు కూడా కోడెలకు మద్దతుగా మాట్లాడలేదు.

 

తర్వాత కోడెల కొడుకు, కూతురుపై నమోదవుతున్న పోలీసు కేసుల విషయంలో కూడా పార్టీ మాట్లాడటమే లేదు. ఇక ఫర్నీచర్ దొంగతనం విషయంలో కోడెలను వెనకేసుకొచ్చే అవకాశం కూడా పార్టీకి లేకుండా పోయింది. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎవరూ కోడెలను ప్రత్యేకించి పిలవటం లేదని సమాచారం. తనంతట తానుగా కోడెలే వెళ్ళి నేతలను కలుస్తుంటే మాత్రం మాట్లాడుతున్నారంతే.

 

సో పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కోడెలకు కూడా తన పరిస్దితిపై అనుమానాలు మొదలైనట్లే ఉంది. ఎన్టీయార్ పార్టీ పెట్టినప్పటి నుండి ఎంతో యాక్టివ్ గా ఉన్న కోడెలకు ఇపుడు ఇటువంటి పరిస్దితి దాపురించటమంటే స్వయంకృతం కాక మరేమిటి ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: