పాకిస్తాన్ కి కాశ్మీర్ ను భారత్ యూనియన్ టెరిటరీగా ప్రకటించిన తర్వాత వారి బాధ అంతా ఇంతా కాదు. టెర్రరిస్టు కార్యకలాపాలను ఇక వారు భారత్ పైన జరిపేందుకు వీలు లేనందున ఆ కోపాన్ని ఎక్కడ చూపించాలో తెలియక మింగలేక కక్కలేక ఉన్నారు. దీంతో వారు వేరే దారిలో భారత్ ను దెబ్బకొట్టేలా ప్రయత్నాలు చేస్తున్నారు. విషయం ఏమిటంటే అప్పుడెప్పుడో బాలాకొట్ లో ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక విభాగం దాడులు చేసి వారిని హతమార్చిన విషయం తెలిసిందే. దీనిని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సమర్థిస్తూ ఒక ట్వీట్ వేసింది.
అసలు ప్రియాంక చోప్రా ఏంటి? ఆమెను అడ్డంపెట్టుకుని పాకిస్తాన్ భారత్ ను టార్గెట్ చేయడం ఏంటి అనే గా మీ ప్రశ్న.

ప్రియాంక చోప్రా ప్రపంచవ్యాప్తంగా బాగా పేరు మోసిన నటి. కావున ఐక్యరాజ్యసమితి యూనిసెఫ్ కు గుడ్ విల్ అంబాసిడర్ గా ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఉన్నారు. అయితే అప్పట్లో ప్రియాంక పాక్ పై దాడులను సమర్ధించింది అంటూ ఆమెను ఆ పదవి నుంచి తొలగించాలని పాక్ కోరింది. దీనిపై లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాక్ మహిళ అందరి ముందు ప్రియాంక నిలదీసింది. దీనికి ప్రియాంక కూడా గట్టిగానే బదులిచ్చింది. తన దేశం పట్ల అభిమానాన్ని వెల్లడించే హక్కు తనకు ఉందని స్పష్టం చేసింది.

కానీ పాక్ అంతటితో వదిలి పెట్టదుగా. ఎలాగైనా ప్రియాంక నూ అంబాసిడర్ గా తొలగించాలంటూ యూ.యన్ కి లేఖ రాసింది. దానికి ఐక్యరాజ్య సమితి స్పందించి పాక్ మంత్రికి షాక్ ఇచ్చింది. తన వ్యక్తిగత సామర్థ్యం మరియు హక్కుల పై స్పందించే హక్కు ప్రియాంక చోప్రాకు ఉందని స్పష్టం చేసింది. వారి వ్యక్తిగత విషయాలలో తాము తల దూర్చేదిలేదని తేల్చి చెప్పేసింది. అలా ప్రియాంక పై కక్షగట్టిన పాక్కు చెంపపెట్టులాంటిది సమాధానం ఇచ్చింది యూఎన్. 

అలాగే మరోవైపు మన దాయాది దేశానికి ఇంకొక భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ తీవ్రవాద సంస్థలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న పాకిస్తాన్ కు ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ( ఎఫ్ టీ ఎఫ్) నిధులను నిలిపివేసింది వారిని ఏకంగా బ్లాక్లిస్టులో పెట్టింది. తీవ్రవాదాన్ని అరికట్టాల్సినది పోయి వారికి ఇంకా నిధులను సరఫరా చేస్తున్నందుకు ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో ప్రపంచ దేశాల ప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక పతనంతో అల్లాడుతున్న పాకిస్తాన్ ఈ దెబ్బతో ఇంకా ఆర్థిక సంక్షోభం లోకి కూరుకుపోయింది. ఇంక వేరే దారిలేక ఇమ్రాన్ ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులను అమ్మి సొమ్ము చేసుకునే పనిలో పడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: