తిరుమలలో అన్యమత ప్రచారం అంటూ గగ్గోలు పెడుతూ తమ్ముళ్ళు ఓ వైపు, కరడు కట్టిన పచ్చ ఫ్యాన్స్ తో నిండిన సోషల్ మీడియా మరో వైపు, అనుకూల మీడియా ఇంకోవైపు హోరెత్తుతున్నాయి. జగన్ తిరుమలలో ఇతర మతాలకు అవకాశం కల్పిస్తూ పవిత్రతను మంట కలుపుతున్నారని కూడా అంతా గోల పెడుతున్నారు. జగన్ సీఎం అయ్యాక ఇలాంటి అరాచకాలు వరసగా జరుగుతున్నాయని కూడా గుండెలు బాదుకున్నారు.  సీన్ కట్ చేస్తే.


దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ రోజు అసలు గుట్టు విప్పారు. చంద్రబాబు టైంలో ముద్రించిన టికెట్లు అవి అంటూ అసలు నిజం చెప్పారు. పైగా నెల్లూరు  జిల్లా ఆర్టీసీ బస్ టికెట్లను తీసుకొచ్చి తిరుమల బస్ టికెట్లలో కలిపేశారట. మరి ఇంతటి గొప్ప స్క్రిప్ట్ రూపొందించి జగన్ని బదనాం చేయాలని డిసైడ్ అయిపోయారన్న మాట. దీని మీద విచారణ జరిపిస్తామని కూడా మంత్రి గారు  చెబుతున్నారు.


ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుతామని జగన్ హామీ ఇచ్చి దాని మీద కమిటీని కూడా నియమిస్తే కొత్త సర్కార్ మీద ప్రేమ సంగతి దేముడెరుగు ద్వేషం చిమ్మడం, బాబు భక్తులు చాలా మంది ఆర్టీసీలో ఉండడం వల్లనే నెల్లూరు టికెట్లు తిరుమల బస్సులో కనిపించాయన్న మాట. మరి దీని మీద పూర్తి దర్యాప్తు  చేస్తే తమ్ముళ్ళతో పాటు ఆర్టీసీలో ఉన్న బాబు భజన బ్రుందం కూడా బయటపడుతుందని వైసీపీ నేతలు అంటున్నారు.


పనిలో పనిగా మాజీ మంత్రి మాణిక్యాలరావు మీద కూడా ప్రస్తుతం దేవాదాయ మంత్రి వెల్లంపల్లి సెటైర్లు వేశారు. వందకు పైగా గుళ్ళను క్రిష్ణా పుష్కరాల సందర్భంగా చంద్రబాబు కూలగట్టినా, సదావర్తి భూములనుకాజయడానికి నాటి టీడీపీ పెద్దలు స్కెచ్ గీసినా ఉత్సవ విగ్రహంలా ఉండి ఏ మాత్రం పట్టించుకోని మాణిక్యాలరావు ఇపుడు మాత్రం తగుదునమ్మా అంటూ జగన్ సర్కార్ మీద నిందలు వేయడానికి రెడీ అయిపోతున్నారని వెల్లంపల్లి అన్నారు.


ఏ మాత్రం ముందూ వెనకా చూసుకోకుండా ఆయన తమ ప్రభుత్వంపైన విమర్శలు చేయడమేంటని కూడా నిందించారు. గోదావరి పుష్కరాల్లో పదుల సంఖ్యలో భక్తులను చంపేసిన బాబు సర్కార్ లో  అన్నీ చూస్తూ దేవుడి మంత్రిగా ఉన్న మాణిక్యాలరావుకు ఇపుడు మాట్లాడే హక్కు ఉందా అని కూడా ఆయన ప్రశించారు. మొత్తానికి జగన్ని బదనాం చేసేందుకు టీడీపీ ఓ రేంజిలో రెచ్చిపోతోంది. బహు పరాఖ్  జగన్ ..


మరింత సమాచారం తెలుసుకోండి: