అసలు వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడినారు. మీడియాకు ఏమర్ధమైందో .. ఉన్నది లేనిది మొత్తం కల్పించి తెలుగు మీడియా ఎక్కడ లేని హడావుడి చేశారు. దీనితో నిజంగా అమరావతి మారుతుందేమోనని జనాల్లో ఒక రకమైన గందరగోళాన్ని రేపారు. ఇక మీడియా చేసే హడావిడికి టీడీపీ కూడా జత అయ్యి ప్రభుత్వం ఏమి చెప్పకముందే అన్నీ వీళ్ళే క్రియేట్ చేశారు. వైసీపీ నేత మంత్రి బొత్స సత్య నారాయణ చేసిన వ్యాఖ్యలను పట్టుకొని టీడీపీ నానా హంగామా చేస్తుంది. నిజానికి బొత్స సత్య నారాయణ రాజధానిని మారుస్తన్నామని ఎక్కడ చెప్పలేదు. బొత్స చెప్పింది కేవలం .. అమరావతికి వరద పోటు ఎక్కువగా ఉందని నిర్మాణాలకు లక్ష రూపాయలు పెట్టే చోట రెండు లక్షలు పెట్టాలిసిన పరిస్థితి వస్తుందని చెప్పారు.


అంతక మించి ఇంకేమి చెప్పలేదు. కానీ టీడీపీ మాత్రం తామేదో ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించామని దానిని మార్చవద్దని తెగ బాధపడిపోతోంది. అమరావతి మార్పు అనేది ఎక్కడ కూడా వైసీపీ ప్రభుత్వం ప్రకటించలేదు. కానీ టీడీపీ తో పటు మీడియా కూడా అతిగా ప్రసారం చేస్తూ నానా హంగామా చేసింది.  ఎన్నికల ముందు కూడా వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని మారిపోతుందని .. దొనకొండకు తరలిస్తారని చంద్రబాబు ఎన్నికల్లప్పుడు ఆరోపించారు. దాని ద్వారా ప్రజల్లో ఓట్లను పొందాలని చూశారు.


పచ్చ మీడియా కూడా ఎన్నికలప్పుడు ఇలాంటి గాలి వార్తలే ప్రముఖంగా ప్రచురించి ప్రజల్లో కన్ఫ్యూషన్ ను క్రియేట్ చేయాలని చూశారు. కానీ ఏం జరిగిందో మనం చుసము. ప్రజలు చాలా క్లారిటీగా ఓట్లు వేసి జగన్ ను గెలిపించారు. అయితే ఇప్పుడు వైసీపీ మంత్రి ఒకటి మాట్లాడితే దానిని వక్రీకరిరంచి టీడీపీ అండ్ మీడియా ఏదేదో అర్ధం పర్ధం లేని వ్యాఖ్యలను చేస్తుంది. నిజానికి జగన్ కూడా  ఇంత వరకు రాజధానిని మారుస్తానని ఎక్కడ చెప్పలేదు. నిన్న కూడా వైసీపీ రాజ్య సభ సభ్యుడు విజయ సాయి రెడ్డి కీడా క్లారిటీ ఇచ్చారు. రాజధానిని మారుస్తామని ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదని అలాంటప్పుడు ఇటువంటి అపోహలు అన్నీ అనవసరమని తేల్చేశారు. నిజానికి అమరావతిలో భూముల విషయంలో చాలా అవినీతి జరిగిందని వైసీపీ చెబుతుంది గాని రాజధానిని మారుస్తామని మాత్రం ఎవరు చెప్పలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: