అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు మాజీ ఛీఫ్ మార్షల్ గణేష్ పెద్ద షాకే ఇచ్చారు. అసెంబ్లీ ఫర్నీచర్ దొంగతనం వ్యవహారంలో ఇపుడు చీఫ్ మార్షల్ సాక్ష్యమే కీలకంగా మారింది. ఫర్నీచర్ ను కోడెల దొంగతనం చేశాడనటానికి చీఫ్ మార్షల్ అప్రూవర్ గా మారిపోయారు. చీఫ్ మార్షల్ సాక్ష్యం కారణంగానే కోడెల విలువైన అసెంబ్లీ ఫర్నీచర్ ను దొంగతనం చేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అసెంబ్లీలో ఫర్నీచర్ ఉంటే భద్రత ఉండదని కోడెల జనాల చెవిలో పువ్వులు పెట్టే ప్రయత్నం చేసిన విషయం అందరికీ తెలిసిందే.

 

కాకపోతే చీఫ్ మార్షల్ సాక్ష్యంతో కోడెల దొంగతనం చేసినట్లు రుజువైపోయింది. అసెంబ్లీ ఫర్నీచర్ ను తన ఇంటితో పాటు క్యాంపు కార్యాలయంలో ఉంచుకున్నట్లు చెప్పిన కోడెల తన కొడుకు శివరామ కృష్ణ మోటారు వాహనాల షో రోములో ఉందనటం తప్పుడు ప్రచారంగా కొట్టేశారు. కానీ అసెంబ్లీ అధికారుల సోదాల్లో చాలా ఫర్నీచర్ షో రూములో కూడా దొరికింది.

 

షో రూములో అసెంబ్లీకి చెందిన కుర్చీలు, 42 ఏసిలు, టేబుళ్ళు తదితర ఫర్నీచర్ దొరికింది. దాంతో  దొరికిన ఫర్నీచర్ మొత్తాన్ని అసెంబ్లీ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. అదే సమయంలో హైదరాబాద్ నుండి అసెంబ్లీ ఫర్నీచర్ అమరావతికి పంపే సమయంలో నాలుగు లారీల ఫర్నీచర్లో  ఒక లారీ ఫర్నీచర్ ను తానే దగ్గరుండి  కోడెల ఇంటికి, క్యాంపు కార్యాలయంతో పాటు షో రూముకు పంపిచినట్లు సాక్ష్యం చెప్పారు.

 

కోడెల ఆదేశాల వల్లే తాను దగ్గరుండి ఒక లారీని నరసరావుపేట, సత్తెనపల్లిలోని కోడెల ఇంటికి, సత్తెనపల్లిలోని కొడుకు షో రూముకు పంపినట్లు అంగీకరించారు. చీఫ్ మార్షల్ సాక్ష్యం వల్ల మూడు రోజులుగా కోడెల చెబుతున్నదంతా కేవలం కథలు మాత్రమే అని తేలిపోయింది.  కోడెల దొంగతనానికి ఎలాగూ చీఫ్ మార్షల్ సాక్ష్యం ఉంది కాబట్టి ఇదే కేసు విషయమై మాజీ స్పీకర్ పై కేసు పెట్టి అరెస్టు చేయటం ఒకటే మిగిలింది.


మరింత సమాచారం తెలుసుకోండి: