పోలవరం విషయంలో రాష్ట్రానికి  కేంద్ర ప్రభుత్వం మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం విషయంలో రివర్స్ టెండరింగ్ కి వెళ్లడం కేంద్రానికి అసలు ఇష్టం లేని విషయం తెలిసిందే. అయితే కేంద్రానికి .. పోలవరం అధారిటీ నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో రివర్స్ టెండరింగ్ అవసరం లేదని .. ఇప్పటికే ప్రాజెక్ట్ మూడేళ్లు లేట్ అయ్యిందని ఇంకా లేట్ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారుతుందని చెప్పుకొచ్చారు. అయితే ఈ నివేదికను బట్టి కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవచ్చని చెప్పాలి. అయితే ఇప్పటికే హై కోర్ట్ తీర్పు నేపథ్యంలో జగన్ సర్కార్ ఇబ్బందుల్లో పడింది.  ఇదే అదునుగా తీసుకోని ప్రతి పక్ష పార్టీ అయిన టీడీపీ రెచ్చిపోతుంది. చంద్రబాబు అయితే జగన్ మీద పరుష పదజాలంతో రెచ్చిపోతున్నారు.


అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఖచ్చితంగా ఇరకాటంలో పడిన పరిస్థితి. ఇప్పుడు జగన్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ను రద్దు చేయలేదు. అలాగే మళ్ళీ నవయుగ కంపెనీకి పోలవరం పనులు బాధ్యతలు అప్పగించలేదు. పోలవరం నుంచి నవయుగ కంపెనీకి టెర్మినేషన్ లెటర్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సంగతీ తెలిసిందే. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆ కంపెనీ కోర్టుకు వెళ్లిన సంగతీ తెలిసిందే. అయితే ఇప్పటికే పోలవరం పనులు లేట్ అయినాయని .. మళ్ళీ ఇంకాజ్ జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పిన సంగతీ తెలిసిందే. 


ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యల పట్ల పోలవరం అధారిటీ ( కేంద్ర జల వనరుల శాఖ ) తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ టెండరింగ్ కు వెళ్లాల్సిన పని లేదని ఇది సమయం వృధా పని అని తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. కానీ జగన్ మాత్రం ఎట్టి పరిస్థితిలో రీటెండరింగ్ కు వెళ్ళాలిసిందేనని చెప్పుకొచ్చారు . ఇప్పటికే రీటెండరింగ్ కు సంభందించి జగన్ ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది.  అయితే ఇప్పుడు జగన్ సర్కార్ ఏం చేయబోతుందని ఆసక్తికరంగా మారింది. అయితే పోలవరంలో పూర్తి పెట్టుబడి కేంద్ర ప్రభుత్వానిది కాబట్టి ఈ విషయంలో కేంద్రం ఎదో ఒక నిర్ణయం తీసుకోని .. జగన్ సర్కార్ ను అమలు చేయాల్సిందని ఆర్డర్ వేయొచ్చని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: