పోలవరం రివర్స్ టెండరింగ్ పై కోర్టు లో తగిలిన ఎదురుదెబ్బ కారణంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన దూకుడు ను తగ్గించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారా ? లేదంటే గతం లో మాదిరిగానే దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటారా ? అన్నది ఇప్ప్పుడు  హాట్ టాఫిక్ గా మారింది . పోలవరం ప్రాజెక్టు , హైడల్ ప్రాజెక్టు నిర్మాణ పనులు దక్కించుకున్న నవయుగ కంపెనీ ని కోర్టును ఆశ్రయించడం, రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలన్న ప్రభుత్వానికి కోర్టులో చుక్కెదురైంది విషయం తెల్సిందే .  పోలవరం అథారిటీ వద్దని చెప్పిన జగన్ సర్కార్, రివర్స్ టెండరింగ్ కు వెళ్లిన విషయం తెల్సిందే .


 రివర్స్ టెండరింగ్ వల్ల సమయం , డబ్బు వృధా అవుతాయని అథారిటీ సభ్యులు  పేర్కొన్న, జగన్ సర్కార్ ఖాతరు చేయలేదు . ఎవరెన్ని చెప్పినా వినకుండా, రివర్స్ టెండరింగ్ కు వెళ్లగా , రివర్స్ టెండరింగ్ పై ముందుకు వెళ్లవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం తో జగన్ సర్కార్ గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది . నిబంధనల ప్రకారం వేగంగా పనులు చేస్తున్న తమను రాష్ట్ర ప్రభుత్వం  ఉద్దేశపూర్వకంగా తప్పించి రివర్స్ టెండరింగ్ కు  వెళ్ళిందని నవయుగ సంస్థ హైకోర్టుకు విన్నవించింది . ఇరు వర్గాల  వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.


  హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపధ్యం లో    పోలవరం పనులను ఇకపై నవయుగ సంస్థే  కొనసాగించే అవకాశాలు ఉండడం తో జగన్ సర్కార్, ఏమి చేస్తుందన్న చర్చ కొనసాగుతోంది . పోలవరం పనులు నవయుగ సంస్థ ద్వారానే చేపడుతారా? లేకపోతే  తాము రివర్స్ టెండరింగ్ కు వెళ్లడం కరెక్టేనని న్యాయస్థానం లోనే  తేల్చుకోవాలని భావిస్తారా?? అన్నది రానున్న రోజుల్లో తెలియనుంది .  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత కొద్ది రోజుల క్రితం పోలవరం టెండర్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే .


మరింత సమాచారం తెలుసుకోండి: