కర్ణాటకలో ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్  జేడీస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. సుమారు ఒక సంవత్సరం పాటు మాత్రం ఈ సంకీర్ణ ప్రభుత్వం ఉండగలిగింది. అయితే మొదటి సారిగా దేవెగౌడ .. ప్రభుత్వం కూలిపోవడానికి కారణం సిద్దరామయ్యే అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం కూలిపోవడానికి కారణం సిద్దరామయ్యే అని అతని క్లోజ్ ఫ్రెండ్స్ కూడా చెబుతున్నారని దేవెగౌడ చెప్పుకొచ్చారు. సిద్దరామయ్యను సంతృప్తి పరచడం కోసం మా ప్రభుత్వం చాలా చేసిందని కానీ సిద్దరామయ్య సంతృప్తి చెందలేదని ఆయన వాపోయ్యారు. ఇంతక ముందు కూడా కుమార స్వామీ కూడా ఇలానే స్పందించారు. సిద్ద రామయ్యకు మొదటి నుంచి జేడీస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇష్టం లేదని .. అందుకే ప్రభుత్వాన్ని పడగొట్టారని చెప్పుకొచ్చారు. 


అయితే కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీకి కూడా కష్ట కాలం మొదలు కాబోతుంది.  కర్ణాటకలో కాంగ్రెస్ — జేడీస్ ప్రభుత్వం కూలిపోయిన తరువాత బొటా బొటి మెజారిటీ తో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ — జేడీస్ సంకీర్ణ ప్రభుత్వం కూల్చడానికి కొంత మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన సంగతీ తెలిసిందే. ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మరీ ప్రభుత్వాన్ని కూలగొట్టారు. కొంత మంది ఎమ్మెల్యేలు ను స్పీకర్ అనర్హత వేటు వేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే బల పరీక్షలో నెగ్గిన బీజేపీ .. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. 


ఇప్పటీకే మంత్రి వర్గంలో చోటు దక్కని వారు చాలా అసంతృప్తితో రగిలి పోతున్నారంటా ..  ఎక్కడ అసంతృప్తి ఎమ్మెల్యేలు మళ్ళీ తిరుగుబాటు చేసి కాంగ్రెస్ గూటికి చేరుతారేమోనని యెడ్యూరప్ప సర్కార్ కు ఇప్పుడు ఆ భయం పట్టుకుంది. అయితే తిరుబాటు చేసిన ఫర్వాలేదు గాని ఒక వేళ ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరితే మాత్రం మొదటికే మోసం వస్తుంది. దీనితో యెడ్యూరప్ప ఆచి తూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: