జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్ధిర పరిచేందుకు కుట్ర జరుగుతోందా ? ఇపుడిదే అనుమానం మొదలైంది. మొన్నటి ఎన్నికల్లో వైసిపి చేతిలో చావు దెబ్బతిన్న చంద్రబాబునాయుడు జగన్ పై రగిలిపోతున్నారు. జగన్ ను అసలు ముఖ్యమంత్రిగా అంగీకరించలేకపోతున్నారు. ఆ విషయం చంద్రబాబు మాటల్లో స్పష్టంగానే తెలిసిపోతోంది. అందుకే రాజకీయంగా జగన్ పై బురద చల్లేందుకు చంద్రబాబు అండ్ కో యధాశక్తి ప్రయత్నిస్తోంది.

 

అదే సమయంలో అధికార వ్యవస్ధలో కూడా కొందరు జగన్ ను ఉద్దేశ్యపూర్వకంగానే గబ్బు పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా తిరుమల బస్సుల్లో ప్రయాణీకులకు ఇచ్చే టిక్కెట్ల వెనుక అన్యమత ప్రచారం ప్రకటనలు ఉండటమే ఉదాహరణ. నిజానికి ఈ టిక్కెట్లను ప్రింట్ చేసింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు.

 

అప్పుడు ప్రింట్ చేసిన టిక్కెట్లు ఇపుడు చెలామణిలోకి రావటమే విచిత్రంగా ఉంది. మొన్నటి ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది టిడిపి ప్రభుత్వం హయాంలో ప్రింట్ అయిన ముస్లిం, క్రిస్తియన్ ప్రకటనలున్న టిక్కెట్లు ఇపుడు బయటకు ఎలా వచ్చాయి ? చంద్రబాబు హయాంలో ప్రింట్ అయిన టిక్కెట్లను జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా చెలామణిలోకి తెస్తారు ?

 

అంటే జగన్ ను కావాలని గబ్బు పట్టించేందుకే ఈ పని చేసినట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. తన తప్పును టిడిపి ఎప్పటికి ఒప్పుకోదు. అలాగే ఇపుడు కూడా జగన్ పైనే బురద చల్లుతోంది. ఆమధ్య స్కూలు పిల్లలకు సైకిళ్ళ పంపిణీ జరిగింది. మదనపల్లి, పీలేరు ప్రాంతాల్లో పంపిణీ చేసిన సైకిళ్ళపై చంద్రబాబు, గంటా శ్రీనివాస్ ఫొటోలున్న సైకిళ్ళనే పంపిణీ చేశారు.

 

సైకిళ్ళు పంపిణీ చేసేటపుడు వాటిపై ఎవరి ఫొటోలున్నాయి అన్న విషయాలను కూడా అధికారులు చూసుకోలేరా ? కంటికి కనబడుతుంటే ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. అయినా అలాగే పంపిణీ చేశారంటే చంద్రబాబుకు అనుకూలంగా జగన్ కు వ్యతిరేకంగా కొందరు అధికారులు పనిచేస్తున్నట్లు స్పష్టంగా అర్ధమైపోతోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: