కర్ణాటక రాజకీయాలు ఎప్పుడు రసవత్తరంగా సాగుతాయి. సంకీర్ణ ప్రభుత్వం కాంగ్రెస్  జేడీస్ పడిపోయిన తరువాత బీజేపీ ప్రభుత్వం కొలువు దీరింది. అయితే ఇంకా కాంగ్రెస్  జేడీఎస్ నేతలు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇప్పటికే కర్ణాటకలో ప్రభుత్వం కూలిపోవడానికి కారణం సిద్దరామయ్యే నని .. దేవెగౌడ  కుమార స్వామి వ్యాఖ్యానించిన సంగతీ తెలిసిందే. అయితే మొదటి సారిగా దేవెగౌడ .. ప్రభుత్వం కూలిపోవడానికి కారణం సిద్దరామయ్యే అని చెప్పుకొచ్చిన సంగతీ తెలిసిందే . ప్రభుత్వం కూలిపోవడానికి కారణం సిద్దరామయ్యే అని అతని క్లోజ్ ఫ్రెండ్స్ కూడా చెబుతున్నారని దేవెగౌడ చెప్పుకొచ్చారు.


సిద్దరామయ్యను సంతృప్తి పరచడం కోసం మా ప్రభుత్వం చాలా చేసిందని కానీ సిద్దరామయ్య సంతృప్తి చెందలేదని ఆయన వాపోయ్యారు. ఇంతక ముందు కూడా కుమార స్వామీ కూడా ఇలానే స్పందించారు. సిద్ద రామయ్యకు మొదటి నుంచి జేడీస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇష్టం లేదని .. అందుకే ప్రభుత్వాన్ని పడగొట్టారని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు సిద్దరామయ్య దేవెగౌడ  కుమార స్వామి మీద దండయాత్ర మొదలు పెట్టాడు.


అసలు ప్రభుత్వం కూలిపోవడానికి కారణం అబ్బాకొడుకులేనని .. చేసిన తప్పులను చేసి తన మీద నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీకి కూడా కష్ట కాలం మొదలు కాబోతుందని తెలుస్తుంది. కర్ణాటకలో కాంగ్రెస్ — జేడీస్ ప్రభుత్వం కూలిపోయిన తరువాత బొటా బొటి మెజారిటీ తో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ — జేడీస్ సంకీర్ణ ప్రభుత్వం కూల్చడానికి కొంత మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన సంగతీ తెలిసిందే. ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మరీ ప్రభుత్వాన్ని కూలగొట్టారు. కొంత మంది ఎమ్మెల్యేలు ను స్పీకర్ అనర్హత వేటు వేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే బల పరీక్షలో నెగ్గిన బీజేపీ .. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: