ఈ ఏడాది బీజేపీ వరస ముఖ్యనేతలను కోల్పోతున్నది.  ఈ ఏడాది ఎన్నికలకు ముందు బీజేపీ సీనియర్ నేత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ను పార్టీ కోల్పోయింది.  అయన క్యాన్సర్ బారిన పడి మరణించారు.  గోవా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఆ తరువాత గోవా నుంచి ఢిల్లీ వెళ్లి రక్షణ బాధ్యతలు చేపట్టారు. రక్షణ శాఖా మంత్రిగా పనిచేసిన తరువాత తిరిగి గోవా వచ్చి ముఖ్యమంత్రిగా పనిచేశారు.  


మనోహర్ పారికర్ లేని లోటు గోవాలో స్పష్టంగా కనిపిస్తోంది.  అయితే, ఇది జరిగిన కొన్ని రోజులకు అంటే ఆగష్టు 6 వ తేదీన మరో సీనియర్ నేత సుష్మా స్వరాజ్ మరణించారు.  మూత్రపిండాల వ్యాధితో ఆమె బాధపడుతున్న సంగతి తెలిసిందే.  ఆగష్టు 5 వ తేదీన భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.  ఈ కీలక నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే సుష్మా స్వరాజ్ గుండెపోటుతో మరణించింది.  


ఇది జరిగిన 19 రోజులకు బీజేపీకి చెందిన మరో ముఖ్యనేత, మాజీ కేంద్ర మంత్రి అర్జున్ జైట్లీ మృతి చెందటం బాధాకరం అని చెప్పాలి.  గత కొన్ని రోజులుగా అయన మూత్రపిండాలకు సంబంధించిన జబ్బుతో బాధపడుతున్నారు.  కిడ్నీ మార్పిడి తరువాత కూడా అయన అనేక ఇబ్బందులు పడ్డారు.  గత వారం రోజులుగా అయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.  


కాగా ఈ ఉదయం మరోసారి ఆరోగ్యం క్షిణించింది.  వైద్యులు ఎంతగా ప్రయత్నం చేసినా లాభంలేకపోయింది.  ఈ మధ్యాహ్నం కొద్దిసేపటి క్రితమే అయన మరణించినట్టు ఎయిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు.  ఇది బీజేపీకి తీరని లోటు అని చెప్పాలి.  మొదటి నుంచి ఆయన బీజేపీలోనే ఉన్నారు.


అప్పట్లో వాజ్ పాయి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.  ఆర్ధికంగా ఇండియా అభివృద్ధి చెందటంలో అరుణ్ జైట్లీ పాత్ర చెప్పుకోదగ్గది.  అర్జున్ జైట్లీ మరణ వార్త విన్న బీజేపీ షాక్ తిన్నది.  హుటాహుటిన ముఖ్యమైన నేతలు ఢిల్లీ ఎయిమ్స్ కు చేరుకుంటున్నారు.  జరగాల్సిన ఏర్పాట్లను చేస్తున్నారు.  ప్రస్తుతం ప్రధాని మోడీ విదేశీ పర్యటనలో ఉన్నారు.  విదేశీ పర్యటన నుంచి మోడీ వెంటనే తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: