ఫైన్ అంటే తెలియని బుడ్డపోరడుకూడ ఉండడు.ఈ పదం మన కేసీయార్ గారు వచ్చాక చాలా చాలా పాపులర్ ఐయ్యింది.మాయిష్టం వచ్చినట్లు డ్రైవ్‌చేస్తాం,అన్నవాళ్ల పప్పులు ఉడకనీయటం లేదు ట్రాఫిక్ సార్లు  ముక్కు పిండి మరీ వసూల్ చేస్తున్నారు.ఇంతకు ఈ స్టోరంతా మాకెందుకు అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా,ఫైనేస్తే జేబులోనుండి డబ్బులు కట్టాలంటే ఓ తెగ ఫీలై పోతాం అలాంటిది ఓ జంతువుకు ఫైనేస్తే ఎలాకడుతుంది,ఎవరుకడాతారంటే దాని ఓనర్ కడతాడు,దానికి నోరులేదుకదా,డ్రైవింగ్ చేయదుకదా మరెలా అని ఇదైపోకండి,ఫైన్ వేసింది, డ్రైవింగ్ చేసినందుకు కాదు,ఆకులు తిన్నందుకు.చెట్టు ఆకులు తింటే ఫైనా అని నోరెళ్లబెట్టకండి ఈగలు నోట్లోకి వెళ్తాయి..



వివరాల్లోకెళితే ఈ వింత ఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లా చిలుకూరు గ్రామ పంచాయతీలో చోటుచేసుకుంది.చిలుకూరు ఆలయం వద్ద హరితహారం మొక్కలు నాటారు,అయితే,ఓ మేక ఆ మొక్కకు ఉన్న ఆకులను తినేసింది.ఈ సమాచారం అందుకున్న పంచాయతీ కార్యదర్శి..సదరు మేక యజమానికి రూ.500 జరిమానా విధించి,మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.ఎవ్వరైనా సరే హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను ధ్వంసం చేయాలని చూసినా,పీకేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.



చెట్ట్లు దేశప్రగతికి మెట్లు అన్న నినాదం మనం గోడలపై చూస్తున్నాం,దేశానికేమో గాని మన ఆరోగ్యానికి మాత్రం నిజంగా మెట్లే.మరి ఇలాంటి చర్యలు రాష్ట్రమంతా తీసుకుంటే బాగుంటుంది కదా,ఖజానకు ఖజాన నిండి అదనపు ఆదాయం సమకూరుతుందని ఈ వార్త చదివిన వారు అనుకుంటున్నారు.కాగా,హరితహారం మొక్క తిన్నందుకు మేకకు జరిమానా విధించడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. మేకకు ఫైన్ వేశారా? అంటూ చర్చించుకుంటున్నారు జనమంతా..ఇక ఈ మధ్యకాలంలో మొక్కల సంరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: