జగన్ తాను కాకుండా పాతిక మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పాత కొత్త కలుపుకుని అంతా ఉన్నారు. ఇక సామాజికవర్గాల పరంగా చూసుకున్నా బీసీలకు జగన్ పెద్ద పీట వేశారు. దాంతో మంత్రివర్గంలో జూనియర్ల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. వందరోజుల పాలనకు దగ్గరవుతున్న జగన్ మంత్రుల పనితీరుని అంచనా వేయడం అపుడే స్టార్ట్ చేశారట. మరి జగన్ ఎవరెరవరికి మార్కులు వేశారో చూస్తూంటే ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి.


జగన్ మంత్రుల్లో సీనియర్లు మాత్రమే ఇపుడు జగన్ మార్కులు సంపాదించుకున్నారట. వీరు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరరెడ్డి బాగా పనిచేస్తున్నరని జగన్ లెక్కలో తేలిందని అంటున్నారు. వీరిని అయిదేళ్ళ పాటు జగన్ కంటిన్యూ చేస్తారని కూడా అంటున్నారు. తమ శాఖలపైన, పాలనపైన వీరికి అనుభవం ఉండడంతో పాటు, విపక్షంతో  గట్టిగానే కలబడుతూ పార్టీని ప్రభుత్వాన్ని నిలబెడుతున్నారని అంటున్నారు. దాంతో వీరి అండదండలు పార్టీకి చాలా అవసరమని జగన్ భావిస్తున్నారుట. దీంతో ఈ అయిదుగురు మంత్రులు జగన్ తో పాటే అయిదేళ్ళు కొనసాగుతారన్నమాట.



మిగిలిన ఇరవై మంది మంత్రుల్లో కూడా బాగా పనిచేస్తే కంటిన్యూ చేయడానికి జగన్ కి ఏం అభ్యంతరం లేదు కానీ చాలా మంది జగన్ అంచనాలకు దూరంగా ఉన్నారట. కొత్త వారనుకున్న వారికి కీలకమైన శాఖలు జగన్ కట్టబెట్టారు. అందులో కొందరికి డిప్యూటీ  ముఖ్యమంత్రులుగా అవకాశం ఇస్తే ఒక్క బోస్ తప్ప మిగతా  డిప్యూటీ సీఎంలు కూడా అనుకున్నంతగా పనిచేయ‌డం లేదని అంటున్నారు.
ఇక దూకుడుగా ఉంటారని జగన్  ఇచ్చిన మంత్రుల్లో కురసాల కన్నబాబు వెనకబడ్డారని తేలుతోంది. ఆయన వ్యవసాయ శాఖ వంటి కీలకమైన బాధ్యతను నిర్వహిస్తున్నా కూడా చడీ చప్పుడూ పెద్దగా లేదు. జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విషయనికి వస్తే ఆయన టీడీపీని బాగానే ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో మంత్రిత్వ శాఖపై ద్రుష్టి పెద్దగా పెట్టలేకపోతున్నారని అంటున్నారు.



ఇక విశాఖకు చెందిన అవంతి శ్రీనివాసరావు శాఖాపరంగానే కాకుండా రాజకీయంగానూ దూకుడుగా ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అలాగే డిప్యూటీలో ఆళ్ళ, పుష్ప శ్రీవాణి, నారాయణ స్వామి ఇంకా జోరందుకోలేదని అంటున్నారు. మంత్రి విశ్వరూప్ అయిపూ అజా లేదని కూడా అంటున్నారు. మహిళా మంత్రుల్లో హోం మంత్రి మేకతోటి సుచరిత తన పనితీరుని బాగా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు


ఇంకా మైనారిటీ మంత్రి ఆంజాద్ భాషా, బీసీ మంత్రి శంకర్ నారాయణ తమదైన ముద్ర వేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.  మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత కూడా ఇంప్రూవ్ కావాల్సి ఉంది. మొత్తం మీద 20 మంది మంత్రుల్లో సగం మందికి ఏవరేజ్ రిజల్ట్ వస్తే, మిగిలిన వారు బిలో ఏవరేజ్ లోనే ఉన్నారని అంటున్నారు. మరి జగన్ వీరిని ఎలా దారిన పెడతారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: