అవినీతిపై యుద్ధం చేస్తామని, అవినీతి ర‌హిత ఆంధ్ర‌ప్ర‌దేశ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామ‌ని ప్ర‌క‌ట‌న‌లు గుప్పించిన చంద్ర‌బాబు పార్టీ టీడీపీ నేత‌లు ఇప్పుడు అదే అవినీతి బుర‌ద‌లో కూరుకుపోయారు. ప్ర‌ధా నం గా ప్ర‌తి విష‌యంలోనూ తాము పార‌ద‌ర్శ‌కంగా ఉన్నామ‌ని చెప్పుకొన్న ఈ నేత‌లు .. ఇప్పుడు తొవ్విన కొద్దీ అక్ర‌మాలు వెలుగులోకి వ‌స్తుండ‌డంతో త‌ప్పించుకునేందుకు కూడా ఇబ్బంది ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు ఆస్ప‌త్రి పాల‌య్యారు. 


ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న పోలింగ్ బూత్ లో త‌న‌ను ప్ర‌జ‌లు త‌న్నార‌ని, వీరిలో వైసీపీ నేత‌లు ఉన్నార‌ని ఆరోపించారు. ఈ క్ర‌మంలోనే చిరిగిన చొక్కా, విరిగిన క‌ళ్ల‌జోడుతో ద‌ర్శ‌న మిచ్చారు. అయినా కూడా సింప‌తీ ఎక్క‌డా ఆయ‌న‌కు రాక‌లేదు. ఇక ఇప్పుడు త‌న కుమారుడు, కుమార్తె స‌హా ఆయ‌న కూడా అవినీతి, దొంగ‌తనం వంటి కేసుల ఉచ్చులో చిక్కుకుని విల‌విల్లాడుతున్నారు. మొత్తానికి ఈ వ్య‌వ‌హారం చాలా తీవ్రంగా మారింది. ఈనేప‌థ్యంలో ఆయ‌న గుండెపోటుకు గుర‌య్యారు. 


క‌ట్ చేస్తే.. ఇప్పుడు కూడా సానుభూతి క‌రువైంది. ఇక‌, విశాఖ‌లో గంటా శ్రీనివాస‌రావు ఉదంతం కూడా ఇలానే ఉంది. ఆయ‌న త‌న కూతురు సాయి పూజిత పేరుతో నిర్మించిన అక్ర‌మ భ‌వ‌నాన్ని కూల్చేస్తామ‌ని మునిసిపాలిటీ ప్ర‌క‌టించింది. వాస్త‌వానికి ప్రాంతానికి విభేదంగా గంటాకు ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. ఆయ‌న ఎక్క‌డ నుంచి పోటీ చేసినప్ప‌టి విజ‌యం అందుకున్న ప‌రిస్థితి ఉంది. అయితే, ఇప్పుడు జ‌రిగిన ప‌రిణామం త‌ర్వాత ఎవ‌రూ ఆయ‌న‌కు మ‌ద్దతిచ్చేందుకు ముందుకు రావ‌డం లేదు. 


ఇవ‌న్నీ ఇలా ఉంటే.. ఈ రెండు ప‌రిణామాల‌పైనా పార్టీ అధినేత‌గా చంద్ర‌బాబు ఎక్క‌డా స్పందించ‌లేక పోయారు. అంతేకాదు, కోడెల విష‌యంలో నామ‌మాత్రంగా మాట్లాడారు. కోడెల చేసిన ప‌నికి చ‌ట్ట ప్ర‌కారం ఎలా ముందుకు వెళ్లినా త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని చెప్పారు. ఇలా మొత్తానికి ఆద‌ర్శ ఆంధ్ర కాస్తా.. అవినీతి ఆంధ్ర అనే పేరు తెచ్చుకున్న క్ర‌మంలో త‌మ్ముళ్ల‌కు గొంతు పెగ‌ల‌డం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: