ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ అంతా పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్, రాజధాని మార్పు పైనే జరుగుతోంది. ఈ రెండు అంశాల్లో ఎప్పుడేం జరుగుతుందో, ఏ నిర్ణయం వెలువడుతుందో రాజకీయ పార్టీలు,  కేంద్ర ప్రభుత్వ పెద్దలు, ప్రజలు.. ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. సీఎం జగన్ ఇండియాలో లేని ఈ ఎనిమిది రోజుల్లో చాలా జరిగాయి. అందులో కృష్ణా వరదలు, రాజధాని మార్పు అంశం, పోలవరం రీటెండరింగ్ పై హైకోర్టు తీర్పు ఉన్నాయి.

 


పోలవరంపై వైసీపీ నిర్ణయం మారేట్టు కనిపించడం లేదు. మేధావులు ఈ అంశంపై ఇదే అంచనా వేస్తున్నారు. హైకోర్టు తీర్పు కేవలం పోలవరం విద్యుత్ (హైడల్) ప్రాజెక్టు విషయంలో స్టే మాత్రమే ఇచ్చిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ తీర్పుతో ప్రాజెక్టు నిర్మాణ పనుల రీటెండరింగ్ కు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. హైకోర్టు స్టే కేవలం నవయుగ కంపెనీ చేపట్టి హైడెల్ ప్రాజెక్టు గురించి మాత్రమేనని రివర్స్ టెండరింగ్ పై కాదని అంటున్నారు. కాబట్టి తాము రివర్స్ టెండరింగ్ విషయంలో వెనక్కి తగ్గమని అంటున్నారు.

 


ఓ పక్క ప్రతిపక్ష టీడీపీ ఈ అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. వరుస ప్రెస్ మీట్లతో ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతోంది. దీనిపై వైసీపీ నుంచి మాట్లాడేవారే కరువయ్యారు. సంబంధిత మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ మాత్రమే దీనిపై స్పందిస్తున్నారు. అంబటి మినహా ఇదివరకు వైసీపీ తరపున ఫైర్ బ్రాండ్స్ గా పేరు తెచ్చుకున్నవారెవరూ ఏ అంశంలోనూ టీడీపీకి కౌంటర్ ఇవ్వటం లేదు. దీంతో ఈ అంశంలో హైకోర్టు తీర్పు, కేంద్రం, టీడీపీలతో వైసీపీ ముప్పేట దాడిని ఎదుర్కొంటోంది. అమెరికా పర్యటన ముగించుకు వచ్చిన జగన్ పోలవరంపై ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: