2019 సంవత్సరం మొదటి నుండి ఇండియా పాకిస్థాన్ మధ్యలో పరిస్థితులు అనేక మలుపు తీసుకుంటున్నాయి. పిబ్రవరి లో బాల్ కోటలోని ఉగ్రవాదుల స్థావరలపై దాడులు చేయడం.  ఈ నెలల మొదట్లో  ఆర్టికల్370 రద్దు చేయడం. రెండు దేశాల మధ్య రవాణా సంబంధాలు ఆగిపోయాయి. అంతర్జాతీయంగా కూడా అన్నిదేశలు భారత్ పైపు ఉండటంతో పాక్ ఒంటరి అయింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ భారత సరిహద్దుల్లో మళ్ళీ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది.
ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లోని సముద్ర జలాల్లో పాక్ పడవలు కనబడటం అనేక అనుమానాలను తావిస్తోంది.గుజరాత్ లోని "కచ్" జిల్లాకు సమీపంలో  " హరామి నాలా" ప్రాంతంలో పాకిస్థాన్ కు చెందిన రెండు ఫిషింగ్ బోట్స్ ను భద్రతా సిబ్బంది గుర్తించారు.రెండు ఫిషింగ్ బోట్స్  కొంచెం అనుమానంగా కనిపించడంతో  తనిఖీలు చేపట్టారు. భారత  నావికాదళం తీర ప్రాంతాలను అలర్ట్ చేశారు.
ఆర్టికల్370 రద్దు నుండి పాకిస్థాన్, భారీగా మందుగుండు సమాగ్రి.సైనిక బలగాలను,వైమానికా దళాలను మోహరించడం తో సరిహద్దులు యుద్దా వాతావరణాన్ని తలిపిస్తుంది.మన దేశానికి ఉగ్ర వాదులతో ముప్పు ఉందని  నిఘా వర్గలు చాలా కాలం నుండి హెచ్చరిస్తున్నాయి.ఇప్పటికే శ్రీలంక మీదుగా కొందరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఇండియాలోకి చొరబడినట్లు సమాచరం. 
ఈ సమయంలో సరిహద్దుల్లో  రెండు ఫిషింగ్ బోట్స్ కనబడటంతో భారత నావికాదళం అప్రమత్తమయ్యారు. తీరప్రాంతాల గుండా ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశించడానికి ఎక్కువగా అవకాశాలు ఉండటంతో. ఆ  ఫిషింగ్ బోట్స్ ను చాలా జాగ్రత్తగా తనిఖీ చేశారు. అయితే మనం భయపడే విధంగా ఏలాంటి అనుమాస్పద వస్తువులు లభించలేవు. ఫిషింగ్ బోట్స్ లో ఉన్నవారిని విచారిస్తున్నారు.  పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుంది. గతకొంత కాలంగా  సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా కాల్పలు జరుపుతుంది.  అమాయకులైనా మన సైనికులు ప్రాణలను కోల్పోతున్నరు.



మరింత సమాచారం తెలుసుకోండి: