ఇప్పుడు ఏ వస్తువు కావాలన్నా షాపుకు వెళ్లి కొనుక్కునే రోజులు పోయాయి. ఈ కామర్స్ పుణ్యమా అని ప్రతి వస్తువూ ఆన్ లైన్ లో దొరకుతుంది. ఇది, అది అని కాదు.. పిల్లల బలపాల దగ్గర నుంచి పెద్దల చేతి కర్రల వరకూ ఆన్ లైన్ లో దొరకని వస్తువంటూ లేదు. కాకపోతే.. వాటిని ఆన్ లైన్‌లో సరిగ్గా వెదుక్కోవాలంతే..


అంతే కాదు.. ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే.. భారీ డిస్కౌంట్లు లభిస్తాయి.. వివిధ రకాల మోడళ్లు చూసుకోవచ్చు.. వివిధ కంపెనీల మధ్య పోలిక చూసుకోవచ్చు.. తక్కువ ధరతో మంచి నాణ్యమైన వస్తువులు పొందవచ్చు.. అయితే ఇదంతా ఆన్ లైన్ షాపింగ్ మీద అవగాహన ఉన్నవారికి మాత్రమే.


ఆన్ లైన్ పోర్టల్స్ గురించి సరైన అవగాహన లేకపోతే.. వినియోగదారులను మోసం చేసే సంస్థలు కూడా నెట్లో ఎన్నో ఉన్నాయి. అతి తక్కువ ధరలు పెట్టి కస్టమర్లను ఆకర్షించి మోసం చేసే సంస్థలు కోకొల్లలు.. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. ఆన్‌లైన్‌లో మొబైల్ కోసం బుక్‌చేస్తే వినియోగదారునికి రిస్టు వాచీ వచ్చిన ఘటన చిన్నపెండ్యాలలో జరిగింది.


వారం రోజుల క్రితం పత్రికలో వచ్చిన ఓ ప్రకటనను చూసి తక్కువ ధరకు చరవాణి వస్తుందని తెలుసుకుని ఆన్‌లైన్‌లో బుక్‌ చేశారు. సదరు కంపెనీ పార్సిల్ పంపింది. మొబైల్ వచ్చేసిందని ఆశతో ఓపెన్ చేసి చూస్తే... మొబైల్ కు బదులు రిస్టు వాచ్ ఉంది. ఇదే విషయంపై కొరియర్‌ బాయ్‌ను నిలదీస్తే పొరపాడైందని చెప్పినట్టు తెలిసింది. ఇక్కడ పొరపాటు వస్తువు ను పంపిన కంపెనీదా..లేక.. పార్శిల్ డెలవరీ బాయ్ తప్పుగా తెచ్చాడా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఏదేమైనా ఆన్ లైన్ లో ఆర్డర్లు బుక్ చేసేటప్పుడు ఒకటికి, రెండు సార్లు సరిచూసుకోవడం బెటర్.


మరింత సమాచారం తెలుసుకోండి: