తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, నందమూరి బాలకృష్ణ రెండో అల్లుడు అయిన భరత్ ఉన్నఫలంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.  అతను జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి ఒక ఇంటర్వ్యూలో అన్న మాటలు ఇప్పుడు తీవ్ర సంచలనాన్ని రేపాయి. భరత్ మొన్న జరిగిన ఎన్నికల్లో వైజాగ్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి ఎంపీ సీటుకు పోటీ చేసి వైసీపీ అభ్యర్థి సత్యనారాయణ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఇదే నియోజకవర్గం నుండి జనసేన నేత, బాగా సుపరిచితుడు అయినా జేడీ లక్ష్మీనారాయణ కూడా పోటీ చేశారు.

అయితే ఈ మధ్యనే జరిగిన ఒక ఇంటర్వ్యూలో టీవీ9 ఛానల్ లో సీనియర్ జర్నలిస్టు అయిన జాఫర్ భరత్ ను కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటిలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు సంబంధించినవి ఉన్నాయి. ఇదే ప్రస్తావనలో జాఫర్.. జూనియర్ ఎన్టీఆర్ వస్తే పార్టీ పరిస్థితి ఏమైనా మెరుగుపడుతుందా అన్న ప్రశ్నలకు చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. తాము ఇన్నాళ్ళ నుండి పార్టీలో ఉండి పార్టీని కాపాడుతున్నామని… ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చి కొత్తగా చేసేది ఏమీ లేదని ఆయన అన్నారు. 

అతని మాటలకు కంగుతిన్న జాఫర్ మళ్లీ ఆయన్ని సూటిగా ప్రశ్నించారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పార్టీ లోకి రావాల్సిన అవసరం ఉందా లేదా అని అడిగితే…అతను రావాల్సిన అవసరం ఏమాత్రం లేదని కరాఖండిగా చెప్పేశారు. తమలో చాలామంది నాయకులకి టాలెంటు ఉందని, కొత్త రూపకల్పనతో మళ్లీ పార్టీని తాము బిల్డ్ చేసుకుంటామని ఆయన అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కి చరిష్మా ఉంది…పెద్ద హీరో…ఫ్యాన్స్ కూడా ఉన్నారని అయితే అతని అవసరం పార్టీకి చాలా ఉంది అని పార్టీ పెద్దలు ముఖ్యంగా అధ్యక్షుడు అనుకుంటేనే ఆయన పార్టీలోకి రాగలుగుతాడు అని చెప్పేశారు. పైగా జూనియర్ ఎన్టీఆర్కు రాజకీయాలలో ఆసక్తి ఉంటేనే ఆయన వస్తారని ఇప్పుడు మాత్రం ఆయన రావడం పార్టీకి ఎంతవరకు అవసరం అంటే అది కేవలం అర్థం లేని ప్రశ్న అని ఆయన తేల్చి చెప్పేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: