ఆంధ్రప్రదేశ్ శాసనసభ సామాగ్రిని అక్రమంగా తన సొంత అవసరాలకోసం వినియోగించుకున్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పై కేసు నమోదైంది.  అసెంబ్లీ సెక్షన్ ఆఫీసర్ ఈశ్వరరావు ఫిర్యాదు మేరకు తుళ్లూరు  పోలీసులు అయన పై  కేసు నమోదు చేశారు.  అసెంబ్లీ సామాగ్రిని తన సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు కావడం తో, శివప్రసాదరావు పై  ఐపీసీ 409,  ఐపీసీ  414 సెక్షన్ల కింద  కేసు నమోదు చేశారు . కేసు నమోదు చేసిన కోడెల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడగానే ఆయన్ని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది .


  అసెంబ్లీ సామాగ్రిని తన సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నట్లు కోడెల స్వయంగా అంగీకరించిన విషయం తెల్సిందే . అవసరమైతే అసెంబ్లీ సామాగ్రి కి డబ్బులు చెల్లిస్తానని పేర్కొన్నారు . హైదరాబాద్ నుంచి అమరావతి అసెంబ్లీ తరలించే సమయం లో అసెంబ్లీ సామాగ్రి ని తన ఇంట్లో పెట్టుకోవడమే కాకుండా , తన కుమారుడి షో రూమ్ లోను ఉంచినట్లు అసెంబ్లీ అధికారులు గుర్తించారు . కోడెల తనయుడు శివరాం నిర్వహిస్తున్న గౌతమ్ బైక్  షో రూమ్ లో అసెంబ్లీ సామాగ్రి ఉన్నట్లు గుర్తించిన అసెంబ్లీ సిబ్బంది తనిఖీకి వెళ్లగా , కోడెల న్యాయవాది వారిని అడ్డగించారు .


  అసెంబ్లీ సామాగ్రి తన వద్ద ఉన్నట్లు తేలడం తో   కేసు తీవ్రతను ముందే గ్రహించి  కోడెల  హార్ట్ ఎటాక్ వచ్చి తన కూతురు ఆసుపత్రిలో చేరారు . కోడెల ఆసుపత్రి లో చేరిన తరువాత  గంట , గంటకు హెల్త్ బులెటిన్  విడుదల చేస్తూ ,  తెలుగుదేశం పార్టీ శ్రేణులు రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నం చేశారని  వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. కోడెల ఆసుపత్రి లో చేరిన తరువాత ఎవర్ని కూడా ఆయన్ని పరామర్శించేందుకు అనుమతించలేదు .


మరింత సమాచారం తెలుసుకోండి: