ప్లాస్టిక్‌ను పక్కాగా నిషేధించి ఆంధ్రప్రదేశ్ కు ఆదర్శంగా నిలిచిన ఆధ్యాత్మిక నగరం కాస్తా.. కాలుష్యంలో మాత్రం దేశ రాజధాని ఢిల్లీతో పోటీ పడుతోంది. పెరిగిపోయిన వాహనాలు.. మురుగు నీటిని చెరువులోకి వదలడం లాంటి స్వయం కృతాపరాధాలతో కాలుష్యంలో చిక్కుకు పోయింది తిరుపతి.


తిరుపతి నగరంలో గత రెండేళ్లుగా కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. ఆస్తమా కేసులు రెట్టింపు అయ్యాయంటే కాలుష్యం నగరవాసులను ఎంతగా పీడుస్తుందో.. తెలుసుకోవచ్చు. ఆధ్యాత్మిక  క్షేత్రంగా తిరుపతికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవారి దివ్య దర్శనం కోసం రోజు వేల సంఖ్యలో భక్తులు తిరుపతికి వస్తుంటారు. దీంతో వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలతో నగరంలో విపరీతంగా గాలి కాలుష్యం పెరిగిపోయింది.


గత పదేళ్ల పరిస్థితి గమనిస్తే.. తిరుపతితో పాటు... తిరుమలలో ప్రమాదకర స్థాయిలో వాహన కాలుష్యం ఎక్కువవుతోంది. దీన్ని కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులే ధృవీకరిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం పెరిగిపోతున్న వాహనాలు. పర్యాటక కేంద్రం కావడంతో నగరంలో కార్లు, ఆటోల వినియోగం పెరిగిపోతోంది. దానికి తోడు సీఎన్‌జీ వాహనాలు తగ్గి.. పెట్రోల్, డీజల్ వాహనాలు పెరిగిపోవడం కాలుష్యానికి కారణం. 


కారణాలు ఏమైనా.. తిరుపతిలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో రంగంలోకి దిగారు నగరపాలక అధికారులు. పొగ ఎక్కువగా రాని వాహనాలను నడిపేలా చర్యలు చేపట్టారు. 50 శాతం వాహనాలను రెండేళ్లలో విద్యుత్తు ఛార్జింగ్‌, బ్యాటరీ వాహనాలుగా మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకు ముందడుగుగా.. ప్రభుత్వ కార్యాలయాల కోసం బ్యాటరీ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. అలాగే, బ్యాటరీ వాహానాలు వాడే వారికి అవసరమైన అన్ని సదుపాయాలు సమకూర్చే పనిలో పడింది నగరపాలక సంస్థ. నగరంలో 10 బ్యాటరీ ఛార్జింగ్‌ స్టేషన్‌ల ఏర్పాటుకు స్థలాలను గుర్తించారు అధికారులు. ఒక్కో స్టేషన్‌లో ఏక కాలంలో 6 వాహనాలకు ఛార్జింగ్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అందులో గంట పాటు ఛార్జింగ్‌ చేస్తే.. ఆ వాహనాలు 120 నుంచి 130 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తాయి. దీంతో భవిష్యత్తులో విద్యుత్‌ వాహనాల సంఖ్య పెరగడం ఖాయమని భావించిన అధికారులు.. అన్ని ప్రాంతాల్లోనూ ఛార్జింగ్‌ స్టేషన్‌ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. మొదటి విడతగా శ్రీనివాసం వద్ద విద్యుత్ చార్జింగ్ సెంటర్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, కమీషనర్ గిరిషా కలిసి ప్రారంభించారు.


అంతేకాదు ప్రభుత్వ అధికారులకు విద్యుత్‌ వాహనాలు వినియోగం తప్పనిసరి చేయనున్నారు. తిరుపతి నగరంలో ఉన్న ఆటోలను సైతం బ్యాటరీ వాహనాలుగా మార్చేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించారు అధికారులు. ఆటో సంఘాలతో చర్చించి.. యాత్రికులు, స్థానిక అవసరాలకు వాడే వాహనాలను ఈ-వాహనాలుగా మార్చేందుకు ప్రభుత్వం నుంచి గరిష్ఠంగా రాయితీలు అందించి ప్రోత్సహించనున్నారు. మరోవైపు.. వ్యర్ధాలు మంచినీటి చెరువుల్లో కలుస్తుండడంతో.. జలకాలుష్యం తీవ్రంగా పెరిగిపోతుంది. గతంలో వందల్లో ఉన్న మంచి నీటి చెరువులు.. ప్రస్తుతం 11కి పడిపోయాయి. మురుగునీటిని శుద్దిచేయకుండా నేరుగా మంచి నీటిచెరువుల్లోకి వదలివేయటంతో సమస్య మరింత జఠిలంగా మారుతోంది. దీంతో చెరవుల్లో నీరు తాగితే యమపురికి చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్ర



మరింత సమాచారం తెలుసుకోండి: