బీజేపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి.  గతేడాది మాజీ ప్రధాని వాజ్ పాయి మరణించిన తరువాత ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు.  ఈ ఏడాది మార్చి నెలలో గోవా ముఖ్యమంత్రి, మాజీ కేంద్రమంత్రి మనోహర్ పారికర్ క్యాన్సర్ కారణంగా మరణించారు.  గోవాకు ఎన్నో సేవలు చేశారు.  అయన గోవా ముఖ్యమంత్రిగా చేస్తూ మధ్యలో కేంద్రం నుంచి పిలుపు రావడంతో ఢిల్లీ వెళ్తున్న సమయంలో ఆ రాష్ట్ర ప్రజలు చాలా బాధపడ్డారు.  


ఒక నేత అలా కేంద్రానికి వెళ్తుంటే బాధపడిన సంఘటనలు చాలా అరుదు. అందుకే తిరిగి అయన గోవాకు వచ్చిన వెంటనే తిరిగి అధికారంలోకి వచ్చారు.  ఈ ఏడాది మార్చి 27 వ తేదీన అయన మరణించడం ప్రతి ఒక్కరిని కలిచి వేసింది.  ఈ సంఘటన జరిగిన ఐదు నెలకు అంటే ఆగష్టు 5 వ తేదీన బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ మరణించారు.  అది బీజేపీకి కోలుకోలేని దెబ్బ.  


ఆమె మరణాన్ని ఎవరూ ఊహించలేదు.  అప్పటి వరకు బాగానే ఉన్న ఆమె అలా సడెన్ గా మరణించడంతో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు.  ఆగష్టు 6 వ తేదీన సుష్మాస్వరాజ్ షాక్ తిన్నది.  ఇది జరిగిన కొన్ని రోజులకు అంటే ఆగష్టు 24 వ తేదీ మధ్యాహ్నం 12గంటల సమయంలో అరుణ్ జైట్లీ మరణించారు.  గత కొంతకాలంగా ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. 


అరుణ్ జైట్లీ లేరన్న వార్తా బీజేపీ నేతలకు కలిచి వేసింది.  ఒకే నెలలో ఇద్దరు నేతలను కోల్పోవడం బాధాకరం అని చెప్పాలి.  ఇదిలా ఉంటె, బీజేపీ సీనియర్ నేత, మురళీ మనోహర్ జోషి ఈ మధ్యాహ్నం అనారోగ్యంతో కాన్పూర్ లోని రీజెన్సీ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.  మురళీ మనోహర్ జోషి సీనియర్ నాయకులు. 

బీజేపీ పార్టీ వ్యవస్థాపకుల్లో ఆయన కూడా ఒకరు.  మొదటి నుంచి బీజేపీతోనే ఉన్నారు.  వాజ్ పాయి హయాంలో మంత్రిగా పనిచేశారు.  కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనది అందెవేసిన చేయి.  మురళీ మనోహర్ జోషి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు అనే వార్తా బీజేపీని భయపెడుతున్నది.  పార్టీలో సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా ఇలా కాలం చేస్తుండటం వారిని భయపెడుతున్నది.  బాధపెడుతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: