ది గ్రేట్ బాలయ్య ఇటు సినిమాల్లో ఆటు రాజకీయాల్లోనూ సత్తా చూపుతు తన రేంజ్ ఏంటో తెలియజేస్తున్నారు. సినిమాల కోసం కొత్త కొత్త లుక్స్ తో ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాడు బాలయ్య బాబు. ఇటు రాజకీయాల్లోనూ అటు సినిమాల్లో పవర్ ఫుల్ గా కనిపించే బాలయ్య అల్లుడ్లని సెలెక్ట్ చేసుకునే పద్దతిలో విఫలమయ్యారని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 


దీనికి కారణం బాలయ్య అల్లుళ్ల నోటి దురుసే. పెద్ద అల్లుడు నారా లోకేష్ కి ఏమో గతంలో మంత్రి హోదాలో బహిరంగ వేదికలపై మాట్లాడుతూ.. 'అంబేద్కర్‌ జయంతిని వర్ధంతి చేశారు.., మంగళగిరిని మందలగిరి చేసారు, 2 లక్షల మెజారిటీని 5 లక్షల మెజారిటీ' చేసి నెటిజన్లతో చీవాట్లు తిని సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. 


ఇంకా చిన్నల్లుడు భరత్ .. విషయానికి వస్తే ఓ ప్రముఖ టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ చుసిన ప్రతి ఒక్కరు బహుశా భరత్ కి ఇదే మొదటి ఇంటర్వ్యూ అనుకుంటా . ఏం మాట్లాడాలో కూడా తెలీదు అని కామెంట్లు చేస్తున్నారు. 'టీడీపీకి ఎన్టీఆర్ అవసరం ఏమాత్రం లేదు' అని ఆ ఇంటర్వ్యూలో అన్నాడు. ఆ ఇంటర్వ్యూ చుసిన ప్రేక్షకులు ఆయనపై ఫైర్ అయిపోతున్నారు. 


కొంతమంది ట్విట్టర్ వేధికగా స్పందిస్తూ 'ఏ మాత్రం బుద్ధి లేదు ఈ బాలయ్య బాబు అల్లుళ్లకు అని ట్విట్ చేస్తున్నారు. మరి కొందరు స్పందిస్తూ  బాలయ్య బాబు ఇద్దరు అల్లుళ్లలో ఒకరు సుద్ద పప్పు మరొకరు ముద్ద పప్పు అని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ ని ఆ మాట అని ఉన్న పరువు కాస్త పోగొట్టుకున్నారు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం బాలయ్య సినిమాల్లో, రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు కానీ అల్లుళ్లను తీసుకొచ్చే విషయంలో సక్సెస్ కాలేకపోయారు అని కామెంట్లు చేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: