ఇది నిరంకుశం

తెలంగాణ ప్రభుత్వం నిరంకుశత్వం తో వ్యవహరిస్తోంద ని ప్రజాస్వామ్యాన్ని అణచివేయాలని కంకణం కట్టుకున్నద ని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు .

ఉదయ సముద్రం మరియు బ్రాహ్మణ   వెల్లం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయ మై తాను సోమ వారం నుండి  చేయ తల పెట్టిన పాద యాత్రను తెలంగాణ ప్రభుత్వం అడ్డు కోవాలని చూస్తోందని  శ్రీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు.

ప్రాజెక్టు కట్టడమే తమకు చాలా ముఖ్యమని చెప్పుకునే శ్రీ కె చంద్రశేఖర రావు గారు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్   సాధన కొరకు తాను చేపట్ట నున్న పాద యాత్రను అడ్డుకోవడం ఎంత వరకు సమంజసం అని శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు.

పాదయాత్రకు  పోలీసు రక్షణ కల్పించ   లేము అని ఎస్పి శ్రీ రంగనాథ్ శ్రీ కోమటిరెడ్డికి  నోటీసు జారీ చేసినట్లు తెలిసింది.  

తనకు ఇంత వరకూ ఏ విధమైన నోటీసులు అందలేద ని,  తన పాద యాత్ర ఎట్టి పరిస్థితిలోనూ ఆగదని పాద యాత్ర విషయంలో ఎటువంటి న్యాయ పోరాటం చేయడానికై నా సిద్ధం అని  ఈ విషయంలో వెనక్కి ఎంత మాత్రం తగ్గేది లేదని శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ రకమైన అణిచి వేత  ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదని ఆయన చెప్పారు. ఇది ఖచ్చితం గా  వ్యక్తి గత స్వేచ్ఛ హరించడమే అని  ఇటువంటి   నిరంకుశత్వం తో ఏమీ సాధించ లేరని ఆయన ప్రభుత్వాని కి హితవు పలికారు.



మరింత సమాచారం తెలుసుకోండి: