సోషల్ మీడియా ప్రపంచం ఈనాడు నడుస్తోంది. దాని వల్ల మేలు ఎంతో ఉంది. ఎక్కడో జరిగిన విషయాలు మరుక్షణం చేరిపోతున్నాయి. సోషల్ మీడియా వల్ల మరుగున పడిన మాణిక్యాలు కూడా తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఎందరో కవులు, గాయకులు, కళాకారులు బయటకు వస్తున్నారు. అదే సమయంలో స్పీడ్ ఎక్కువైన సోషల్ మీడియాతో అనర్ధాలు కూడా ఎన్నో ఉన్నాయి. 


ఈ నేపధ్యంలో కోల్ కటాలో జరిగిన మీడియా అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోషల్ మీడియాపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా విస్త్రుతి బాగా పెరగడం మంచిదే కానీ, వాటికి ఒక చెకింగ్ అవసరం అని సలహా ఇచ్చారు. లేకపోతే ఏ వార్త అయినా సులువుగా జనంలోకి వచ్చేస్తుందని, దాని వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుందని ఆయన అన్నారు.


ఇక కాలాలు ఎన్ని మారినా కూడా ప్రింట్ మీడియా ప్రింట్ మీడియావేనని కూడా మాజీ రాష్ట్రపతి అన్నారు. తనకు ప్రింట్ మీడియా అంటే ఎంతో ఇష్టమని  కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే ఓ వార్తను ఒకటిని పదిసార్లు చెక్ చేసుకుని వేసే మ్యానేజ్మెంట్ అక్కడ ఉంటుందని ఆయన అన్నారు. అందుకే జన విశ్వాసం ఇంకా ప్రింట్ మీడియాపై ఉందని, అది ఎప్పటికీ అలాగే ఉంటుందని కూడా అయన అన్నారు.


ఎన్ని రకాలైన పోటీలు వచ్చినా కూడా ప్రింటి మీడియా వాల్యూ ఎపుడూ తగ్గదని, అది ఎపుడూ స్థిరంగా ఉంటుందని కూడా ప్రణబ్ ముఖర్జీ కితాబు ఇచ్చారు. రాజ్యాంగ కోవిదుడు, రాజకీయ ధురంధరుడు అయిన ప్రణబ్ కితాబ్ ఇచ్చారంటే ప్రింట్ మీడియా బాధ్యత మరింతగా పెరిగినట్లే. దానిని ద్రుష్టిలో ఉంచుకుని మరింతగా ముందుకు సాగాలసిన అవసరం ఎంతైనా ఉంది. వార్తల విషయంలో ఇకపై ప్రింట్ మీడియా మరింత చెక్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: