ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి బయల్దేరారు. ఉదయం పదకొండు గంటలకు జరిగే సీఎంల సమావేశంలో జగన్ పాల్గొంటారు. దేశంలో నక్సలిజం సమస్యపై కేంద్ర హోంశాఖ పై ఈ సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి జగన్ వివిధ శాఖల కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లతో జగన్ సమావేశం అవుతారు. పోలవరం రివర్స్ టెండరింగ్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం కన్పిస్తుంది.


ఈ రోజంతా పలు సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం రేపు ఉదయం తిరిగి అమరావతికి చేరుకుంటారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఈ రోజు ఢిల్లీలో పదకొండు గంటలకు కేంద్ర హోంమంత్రి , హోంశాఖ ఆధ్వర్యంలో వామపక్ష మావోయిస్టు తీవ్రవాదంపై జరిగే సమావేశంలో ఆయన పాల్గొంటారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యమంత్రిలు ఆహ్వానించినప్పటికీ ఏపీ నుంచి ప్రత్యేకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సమావేశానికి హాజరవుతున్నారు.


వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టు సమస్య మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అంతర్రాష్ట్రాలకి సంబంధించినటువంటి భద్రతా ఇలాంటి అంశాల మీద ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. అయితే ఇప్పటి వరకు అపాయింట్మెంట్ కొంతమందితో ఖరారు కానున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు పర్యటన మొత్తం కారణంగా జగన్ ఢిల్లీలోనే ఉండబోతున్నారు. రేపు ఉదయం ఢిల్లీ నుంచి బయల్దేరి విజయవాడకు రానున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో రెండు ప్రధానమైనటువంటి వివాదాలు కొనసాగుతున్నాయి. రాజధాని అంశంతో పాటు పోలవరం రివర్సు టెండరింగ్ కు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసింది.



ఇప్పటికే పోలవరం హెడ్ వర్క్స్ తోపాటు హైడల్ ప్రాజెక్టుకు సంబంధించి రెండిటికి కలిపే రివర్సు టెండరింగ్ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఈనేపధ్యంలో నవయుగ సంస్థ హైడల్ ప్రాజెక్టుపై హైకోర్టుకు వెళ్లడం, హైకోర్టు రివర్సు టెండరింగ్ కు వెళ్లవద్దని హైడల్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీద ఇప్పటికే స్టే ఇచ్చినటువంటి నేపథ్యంలో అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన తరువాత ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు న్యాయశాఖాధికారులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు.


రివర్సు టెండరింగ్ కి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో పీపీఏ కూడా కొన్ని అభ్యంతరాలు లేవనెత్తుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అజయ్ కలన్ తో పాటు విజయసాయిరెడ్డి ముఖ్యమైనటువంటి అధికారులు పిఎంఓ అధికారులు ఢిల్లీకి వెళ్లి ఇప్పటికే కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం మీద రివర్సు టెండరింగ్ కు ఎందుకు వెళుతుందో దీనిమీద సుధీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చినటువంటి నేపథ్యంలో సిఎం వైఎస్ జగన్ కూడా అమిత్ షా తో పాటు సంబంధితమైనటువంటి కేంద్ర మంత్రులు, పలువురు అధికారులతో భేటీ అయ్యి రివర్స్ టెండరింగ్ మీద వివరణ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: