తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన దగ్గర నుంచి ఎంపీ సుజనా చౌదరీ ఓ రేంజ్ లో హడావిడి చేస్తున్న విషయం తెలిసిందే. పాత బీజేపీ నేతలనీ సైతం వెనక్కి నెట్టి తానే పార్టీలో లీడ్ తీసుకోడానికి ట్రై చేస్తున్నారు. తాజాగా రాజధాని విషయంలో సుజనా తనకు నచ్చిన స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. బీజేపీలో ఉన్న ఆయన టీడీపీ మద్ధతుదారుని గానే మాట్లాడుతున్నట్లు అర్ధమైంది. అయితే సుజనా వ్యవహారం వల్ల రాష్ట్ర బీజేపీలో క్రమశిక్షణ తప్పిందని తెలుస్తోంది. కాంగ్రెస్ మాదిరిగా ఎవరికి నచ్చినట్లు వారు మాట్లాడుతున్నట్లు బీజేపీ నేతలు కూడా మాట్లాడేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలు వచ్చాకే బీజేపీలో ఇలాంటి మార్పులు బాగా కనిపిస్తున్నాయి.


ఈ పరిణామాలని గమనించిన బీజేపీ అధిష్టానం జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టిందని తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజులకు ఏం చేయాలో నిర్దేశించినట్లు సమాచారం. ఇక వారు టీడీపీకి లబ్ది చేకూరేలా మాట్లాడే నేతలకు చెక్ పెట్టనున్నారు. ముఖ్యంగా సుజనా చౌదరీకి చెక్ పెట్టడానికి సిద్ధమైంది. ఇటీవల సుజనా అమరావతి విషయంపై మాట్లాడినా మాటలకు విర్దుద్ధంగా జీవీఎల్ తాజాగా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు.


రాజధాని పూర్తిగా ఏపీ ప్రభుత్వం విషయమని, కాకపోతే రాజధానిపై వైసీపీ త్వరగా తెలిస్తే మంచిదని అన్నారు. అలాగే సుజనా,కన్నా లక్ష్మినారాయణలు వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్న విధంగా కేంద్రం జగన్ ప్రభుత్వంపై సీరియస్ గా లేదని జీవీఎల్ పరోక్ష సంకేతాలు ఇచ్చారు. ఇదిలా ఉంటే ఓ సామాజికవర్గానికి చెందిన వారు రాజధాని మారిస్తే ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి అనే దానిపై రహస్య చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే జగన్ అమరావతిపై క్లారిటీ ఇచ్చాకే నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు. 


అదేవిధంగా దీనిపై కేంద్రం దిశా దశా చెప్పాలని కోరుతున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద అయితే జీవీఎల్ వ్యాఖ్యలతో సుజనాకి చెక్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన మున్ముందు రాజధానిపై కేంద్రం లైన్ లోనే మాట్లాడే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఎవరెన్ని మాట్లాడినా రాజధాని విషయంలో సీఎం జగన్ నిర్ణయమే ఫైనల్ కానుంది. ఆయన ఎప్పుడు ఏం నిర్ణయం చెబుతారో తెలియదు. ఇక ఆయన తీసుకునే నిర్ణయం మీదే టీడీపీ, బీజేపీ నేతలు రియాక్షన్ ఉండనుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: