ఏపీ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తాజాగా రాష్ట్రంలో చేస్తున్న హ‌డావుడి అంతా ఇం తా కాదు. మూడు మాసాలు కూడా పూర్తికాని జ‌గ‌న్ పాల‌న‌పై వంద‌రోజులు పూర్త‌యి పోయాయని, రాష్ట్రంలో అరాచ‌కం రాజ్య‌మేలుతోంద‌ని ఆరోపిస్తూ.. చంద్ర‌బాబు త‌న శ్రేణుల‌ను రోడ్ల మీద‌కి తోలుతున్నారు. అంతే కాదు, ఇసుక కొర‌త కార‌ణంగా రాష్ట్రంలో ప‌నులు నిలిచిపోయాయ‌ని, అమ‌రావ‌తిపై రాష్ట్రం ఊగిస‌లాడుతోం ద‌ని, మూడు మాసాల్లోనే జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు సినిమా చూపిస్తున్నార‌నిఅంటున్నారు. నిజ‌మే! 


మూడు మాసాల్లోనే జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు సినిమా చూపిస్తున్నార‌నే అనుకుందాం.. కానీ, ఇంత భీక‌రంగా మీరు రెచ్చిపోవాల్సిన అవ‌స‌రం ఏముంది! మీవాళ్ల‌ను , మీ సామాజిక వ‌ర్గాన్ని ర‌క్షించుకునేందుకు త‌ప్ప‌! అంటున్నారు ప‌రిశీల‌క‌లు. రాష్ట్రంలో మీరు ఇప్పుడు రెచ్చిపోయినంత మాత్రాన జగ‌న్ ప్ర‌భుత్వానికివ‌స్తున్న న‌ష్టం ఏమీలేదు. పైగా ఆయ‌న ప్ర‌వేశ పెట్టి న వలంటీర్ వ్య‌వ‌స్థ నేడు క్షేత్ర‌స్తాయిలో పుంజుకుని, ప్ర‌జ‌ల‌వ‌ద్ద‌కే పాల‌న ను అందిస్తోంది. ప్ర‌తి విష‌యమై.. వ‌లంటీర్లే.. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్తున్నారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను వారికి చేరువ చేస్తున్నారు. 


ఈ నేప‌థ్యంలో ఒక‌టి రెండు విష‌యాల్లో ఏర్ప‌డుతున్న అసౌక‌ర్యాన్ని పెద్ద ఎత్తున భూత‌ద్దంలో పెట్టి చూపించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌జ‌లే భావించ‌డం లేదు. నిజ‌మే రాష్ట్రంలో ఇసుక కొర‌త ఏర్ప‌డింది. అయితే, త‌మ పాల‌న‌లో మాత్రం రెండు మాసాల పాటు ఇసుక‌ను మ‌హిళా సంఘాల‌కు అప్ప‌గించ‌డం కోసం ఆప‌లేదా ? త‌మ్ముళ్లు త‌నివి తీరా ఇసుక‌ను దోచుకుంటూ.. ప్ర‌జ‌ల‌కు చుక్క‌లు చూపించిన‌ప్పుడు.. ప్ర‌తిప‌క్షాల‌ను క‌నీసం ఆందోళ‌న చేసే హ‌క్కు కూడా లేకుండా చేయ‌లేదా ? 


గ‌తాన్నిమ‌రిచి ఇప్పుడు త‌గుదున‌మ్మా.. అంటూ రోడ్డెక్కి ఉన్న ప‌రువు కూడా తీసుకోవ‌డం ఎందుకు?  మీరు అనుభ‌వ‌జ్ఞుల‌ని మీ త‌మ్ముళ్లు న‌మ్ముతున్న‌ప్పుడు.. క‌నీసం వీరికైనా మీరు న‌చ్చ‌జెప్పుకొని పార్టీలో ఉండేలా చూసుకోవాలి. త‌ప్పితే.. రాష్ట్రంలో ఏదో జ‌రిగిపోతోంద‌ని అనుకోవ‌డం పెద్ద పొర‌పాటే అవుతుంది. పైగా ప్ర‌తి విష‌యంలోనూ ఆచి తూచి వ్య‌వ‌హ‌రించే త‌మరు ఈ విష‌యంలో మాత్రం ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం నిజానికి ప్ర‌తి విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది. ఇప్ప‌టికైనా నిర్మాణాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: