మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పశ్చిమగోదావరిజిల్లా పెదవేగి మండలం పినకడిమిలో ఎసైన్డ్ భూమిలో ఇసుక తవ్వుకుంటున్న దళితులను దూషించారని పెదవేగి స్టేషన్లో చింతమనేని పై కేసు పెట్టారు. ఎమ్మెల్యే పదవి పోయినా చింతమనేని ఆగడాలు మాత్రం ఆగడంలేదని, వెంటనే ఆయన్ని అరెస్ట్ చేయాలంటూ దళిత సంఘాలు జిల్లా ఎస్పీ ఆఫీసు ముందు ఆందోళన చేపట్టాయి. 


వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే చింతమనేని ప్రభాకర్ పై పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి పోలిస్టేషన్లో మరోసారి కేసు నమోదైంది. దళితుల పట్ల అనుచితంగా వ్యవహరించారని చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు పోలీసులు. గతంలోను ప్రభాకర్ పై పలు కేసులు బుక్కయ్యాయి. ఎమ్మెల్యే పదవి  పోయినా.. ఆయన ఆగడాలు మాత్రం ఆగడలేదని, చింతమనేనిని అరెస్ట్ చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని దళిత సంఘాలు హెచ్చరించాయి. ప్రభాకర్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో రంగంలోకి దిగిని పోలిసులు ఆయన ఇంటి వద్ద పోలిసులను మోహరించారు. ఇసుక పాలసీని వెంటనే ప్రకటించాలనే డిమాండ్ తో ప్రభాకర్ ధర్నాకు రెడీ కావడంతో.. పోలీసులు ముందే హౌస్ అరెస్ట్ చేశారు. 


తనపై నమోదయిన కేసులు కక్షపూరితమని చింతమనేని కొట్టిపారేసారు. అర్ధరాత్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా పెట్టారో ప్రభుత్వమే చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసుల్ని అడ్డం పెట్టుకుని వేధిస్తున్నారని ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలిసులను అడ్డం పెట్టుకుని తనని వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఉద్దేశ పూర్వకంగా టీడీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని, వేధింపులకు గురిచేస్తున్నారని చింతమనేని అంటున్నారు. చింతమనేని ప్రభాకర్ దళితుల్ని టార్గెట్ చేస్తున్నారని.. దళిత సంఘాలు ఎస్పీకి ఫిర్యాదు చేశాయి. పెదవేగి మండలం పినకడిమి గ్రామంలో ఇంటి నిర్మాణం కోసం ఇసుక తీసుకెళ్తున్న దళితులను దూషించారని ఆరోపించాయి. జిల్లా ఎస్పీ ఆఫీస్ దగ్గర ఆందోళనకు దిగడంతో.. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 24గంటల్లోగా చింతమనేనిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇవ్వడంతో.. దళిత సంఘాలు కాస్త తగ్గాయి.  



మరింత సమాచారం తెలుసుకోండి: