గ‌డిచిన రెండు రోజులుగా రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు ఆస‌క్తిని రేపుతున్నాయి. ముఖ్యంగా రాజ‌ధాని అమ‌రావ‌తిపై వైసీపీ నాయ‌కుడు, మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చేసిన వ్యాఖ్య‌లు ఇప్ప‌టికీ ర‌గులుతున్నాయి. దీంతో ప్ర‌తిప‌క్షాలు రెచ్చిపోతు న్నాయి. నిజానికి బొత్స చేసిన కామెంట్లు భారీ సంచ‌ల‌నాలేమీకావు. అయినా.. కూడా ప‌నిలేని దాస‌రి మాదిరిగా ప్ర‌తిప‌క్ష నా యకులు వ‌చ్చిన అవ‌కాశం ఎందుకు వ‌దులుకోవాలా? అనుకున్నారో ఏమో.. దీనిపై విరుచుకుప‌డుతున్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప క్షం స‌హా నిన్న మొన్న‌టి ఎన్నిక‌ల్లోకేవ‌లం ఒకే ఒక సీటులో విజ‌యం సాధించిన జ‌న‌సేన కూడా రెచ్చిపోతోంది. 


స‌రే రాజ‌కీయంగా వ‌చ్చిన అవ‌కాశాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప‌వ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని స‌రిపెట్టుకుందాం. కానీ, సంద‌ట్లో స‌డేమియా మాదిరిగా ఈ వ్య‌వ‌హారం చూస్తుంటే.. ఏపీలో పార్టీల నేత‌ల‌ను ప్ర‌జ‌లు ఏ ర‌కంగా న‌మ్ముతున్నార‌నే విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి 23 సీట్ల‌తో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్నారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు. ఇక‌, కేవ‌లం ఒకే ఒక ఎమ్మెల్యేతో గెలిచి ప‌వ‌న్ పూర్తిగా చ‌తికిల ప‌డ్డారు. దీంతో ప‌వ‌న్ ప‌ని అయిపోయింద‌ని అంద‌రూ నిష్టూర‌మాడారు. 


కానీ, ఇప్పుడు ప‌రిస్థితి చూస్తుంటే.. 23 మంది ఎమ్మెల్యేలున్న బాబు కంటే కూడా ప‌వ‌న్ దూకుడు పెంచార‌ని అనిపిస్తోంది. ప్ర‌భుత్వంపై చౌక‌బారు విమ‌ర్శ‌లు కాకుండా కొంచెం ఆలోచ‌నాత్మ‌కంగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. రాజులు మారితే రాజ‌ధానులు మారాలా? అంటూ ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న నిజంగానే ఆలోచ‌నాత్మ‌కంగా క‌నిపిస్తోంది. రాజ‌ధాని అంటే పిల్ల‌ల ఆట‌కాదు.. కులాల పేరు చెప్పి రాజ‌ధానిని త‌ర‌లిస్తామంటే ఊరుకునేది లేదు.. అంటూ ప‌వ‌న్ విమ‌ర్శ‌లు సంధించారు. 


ఇవి బాగానే వైర‌ల్ అవుతున్నాయి. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌లు, రాజ‌దానికి భూములు ఇచ్చిన రైతుల‌ను ప‌రిశీలిస్తు న్నా కూడా కొన్ని కొత్త సంగ‌తులు వెలుగు చూస్తున్నాయి. గ‌డిచిన ఐదేళ్ల‌పాటు రాష్ట్రా్న్ని పాలించిన చంద్ర‌బాబుపై న‌మ్మ‌కం క‌న్నా.. అస‌లు ఎన్నిక‌ల్లో రెండు చోట్ల పోటీ చేసి ఒక్క చోట కూడా గెల‌వ‌ని ప‌వ‌న్‌పై వారు ఎక్కువ‌గా అభిమానం చూపుతున్నారు. తాజాగా ఆయ‌న మంగ‌ళ‌గిరిలోని పార్టీ ఆఫీస్‌లో నిర్వ‌హించిన స‌మావేశానికి రాజ‌ధానిలోని 29 గ్రామాల ప్ర‌జ‌లు కూడా వ‌చ్చారు. 


ఆయ‌న వెంట న‌డిచేందుకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. దీంతో అసలు బాబుపై ఉంచాల్సిన న‌మ్మ‌కం.. ఎందుకు ఇలా డైవ‌ర్ట్ అయింద‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. మ‌రి దీనికి ప్ర‌త్యేక రీజ‌న్ ఏమైనా ఉందా? అనే విష‌యం కూడా ఆస‌క్తిగా మారింది. బాబును ఆయ‌న పార్టీ నాయ‌కులే న‌మ్మ‌డం లేదు కాబ‌ట్టి.. తాము మాత్రం ఎందుకు న‌మ్మాలి? అనుకున్నారా?  లేక ఆయ‌న వ‌య‌సు అయిపోయింద‌ని అనుకుంటున్నారా? ఇవ‌న్నీ ఇప్పుటికిప్పుడు ప్ర‌శ్న‌లుగానే ఉన్నాయి. మ‌రి భ‌విష్య‌త్తులో ఏం జ‌రుగుతుందో చూడాలి .



మరింత సమాచారం తెలుసుకోండి: