విజయసాయిరెడ్డి.. వైసీపీలో కీలకమైన లీడర్.. జగన్ తర్వాత ఆ పార్టీలో అంత పలుకుబడి ఉన్న నాయకుడిగా చెబుతారు.. జగన్ కు సంబంధించిన అనేక వ్యవహారాలు చక్కబెడుతుంటారు. కానీ.. ఆయన ఇటీవల చంద్రబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. చంద్రబాబుపై విమర్శల వర్షమే కురిపిస్తున్నారు.


రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా.. విజయసాయిరెడ్డి లెవల్లో దూకుడు మాత్రం చాలా తక్కువ. రాజకీయ విమర్శల్లో వాడే సాధారణ గౌరవాలను విజయసాయిరెడ్డి పాటించే ప్రయత్నం చేయడం లేదు. మనసులో ఉన్నది ఉన్నట్టు ట్వట్టర్లో కుమ్మేయడమే.. అందుకు ఉదాహరణగా తాజా ట్వీట్లు పరిశీలిద్దాం..


"రాజకీయాల్లో హింసా ప్రవృత్తికి ఆద్యుడు @ncbn గారే. ఆయన ఐదేళ్ల రాక్షస పాలనలో వందల మంది వైసీపీ నేతలు జైళ్ల పాలయ్యారు. వేల మందిని గ్రామాల నుంచి తరిమేశారు. 600 మందిని హత్య చేశారు. వృద్ధ జంబూకం శాంతి వచనాలు పలికినట్టు ఇప్పుడు వేధింపుల గురించి మాట్లాడుతున్నారు."


"రాజధాని ప్రాంతాన్ని వరద ముంచెత్తినప్పటి నుంచి @ncbn గారు దెయ్యం పట్టిన వాడిలా మారిపోయారు.భూములపై వందల కోట్లు పెట్టుబడి పెట్టిన తన బినామీలు, బంధువర్గం పరిస్థితి ఏమవుతుందనే బెంగ పట్టుకుంది.ప్రతిపక్ష నేత అయి ఉండీ రియల్ ఎస్టేట్ వ్యాపారిలా తాటాకు చప్పుళ్లు చేయిస్తున్నారు."


"ఇంట్లో కట్టేసిన పెంపుడు కుక్కలన్నింటినీ గొలుసులు విప్పి వదిలేశారు తండ్రీ కొడుకులు. అవి దారిన పోయే వాళ్ళందరి వెంట పడుతున్నాయి. ఈయన ఉస్కో అంటే మొరగటమొక్కటే తెలుసు వాటికి. మొరిగే కుక్కలను తరిమికొట్టిన తర్వాత తమకు బడితె పూజేనని మర్చి పోయినట్టున్నారు. @ncbn @naralokesh @JaiTDP"


" టీటీడీ, దేవాదాయ శాఖల్లో హిందూయేతర ఉద్యోగులు పనిచేయడాన్ని నిషేధిస్తూ @ Andhra PradeshCM గారు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ సెల్ఫ్ డబ్బా వాయించుకునే పెద్ద మనిషి ఇన్నాళ్లు ఎందుకు ఇటువంటి చర్యలు తీసుకోలేదో ప్రజలకు వివరించాలి. @ysjagan @YSRCParty @ncbn "

ఇలాంటి ట్వీట్లు అన్నీ చూస్తుంటే.. ఇప్పటి వరకూ చంద్రబాబుపై ఇంత ఘాటుగా స్పందించిన నేత ఎవరూ లేరేమో అనిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: