టీడీపీ పార్టీని ఇప్పుడున్న పరిస్థితిలో చంద్రబాబు నడపటం కష్టంగా మారింది. ఆయన ఆరోగ్యం సహకరించని పరిస్థితి. ఈ పరిస్థితిలో లోకేష్ ను భవిష్యత్ లీడర్ గా ప్రాజెక్ట్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నించినా నాయకులూ ఒప్పుకోని పరిస్థితి. బాబుకు నేతలు కూడా ఖరాకండిగా చెప్పారు. లోకేష్ ను లీడర్ ప్రకటిస్తే ఇక అంతే సంగతులనీ ! టీడీపీ పార్టీ ఘోర ఓటమి చవి చూసిన తరువాత ఆ పార్టీలో నేతలు పక్క పార్టీ వైవు చూస్తున్న పరిస్థితి. అయితే వైసీపీలో ఖాళీ లేదు కాబట్టి నేతలందరూ బీజేపీ వైపు చూస్తున్నారు. అయితే ఈ వలసలకు కారణం టీడీపీ ఘోర ఓటమి మాత్రమే కాదు .. చంద్రబాబు ఆరోగ్యం కూడా అని తెలుస్తుంది.


మొన్నటికి మొన్న ఒక సభలో చేయి నొప్పిని భరించలేక అక్కడి నుంచి బాబు వెళ్లిపోయిన పరిస్థితి. దీనితో ఇక ఎన్ని రోజులు చంద్రబాబు పార్టీని నడిపించగలడని నాయకులూ భవిస్తున్నారంటా ..!  ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్యం పై టీడీపీలో విపరీతంగా చర్చ నడుస్తుంది. టీడీపీ ఓటమిని ఇంకా చంద్రబాబు ఆ పార్టీ నేతలు జీర్ణించుకునే దశలో ఉన్నట్టు లేదు. ఒకే ఒక ఎన్నికలు టీడీపీ పార్టీని మట్టి కరిపించాయంటే అతిశయెక్తి కాదు. ఆపార్టీ పరిస్థితి గత 30 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఘోరంగా క్షేత్ర స్థాయిలో దెబ్బతినిందంటే అతిశయెక్తి కాదని చెప్పాలి.


ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత అధినేత చంద్రబాబుతో పాటు ఆపార్టీ కార్యకర్తలు కూడా పెద్ద షాక్ కు గురయ్యారు. నిజానికి టీడీపీ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను ఆ పార్టీ అధినేత పసిగట్టలేకపోయారు. చేసిన తప్పులను పదే పదే చేసుకుంటూ పోయారు. దీనితో ఆ పార్టీ ఎప్పుడు చూడలేనంతగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 40 ఏళ్ల యువకుడైన జగన్ ..  రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లో అడుగు పెట్టి 40 ఏళ్ల ఇండస్ట్రీని పాతాళకంలోకి తొక్కేశారు. చంద్రబాబు చివర్లో ఎన్నో  సంక్షేమ పధకాలను ప్రవేశ పెట్టినా ప్రజలు వాటిని విశ్వసించలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: