ఆంధ్రప్రదేశ్ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఆ పార్టీ నుంచి పలువురు నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేసేస్తున్నారు. టిడిపికి చెందిన నేతలు కొందరు బిజెపి వైపు చూస్తుంటే... మరికొందరు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ వైపు చూస్తున్నారు. రాష్ట్రంలో వ్యాపార వ్యవహారాలు ఉన్న వారు ఇక్కడ అధికారంలో ఉన్న వైసిపి గూటికి జంప్ చేసేస్తున్నారు. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన విశాఖ‌ డైరీ చైర్మన్ తులసి రావు కుమారుడు అడారి ఆనంద్ కుమార్, ఆయన కుమార్తె అడారి రమాదేవి వైసీపీలోకి జంప్ చేసేశారు.


వీరిలో అడారి ఆనంద్‌కుమార్ ఎన్నిక‌ల్లో అన‌కాప‌ల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ర‌మాదేవి య‌ల‌మంచిలి మునిసిప‌ల్ చైర్మ‌న్‌గా ప‌నిచేశారు. ఇక తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టిడిపి ఇంచార్జ్ వ‌రుపుల రాజా టిడిపికి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక ఎన్నిక‌ల ఫ‌లితాలు తీవ్ర నిరుత్సాహ ప‌ర‌చ‌డంతో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో కూడా కొంద‌రు త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం ఇత‌ర పార్టీల్లోకి వెళ్లేందుకు ఉత్సాహంతో ఉన్నా స్పీక‌ర్ త‌మ్మినేని పార్టీ మారిన వాళ్ల‌పై అన‌ర్హ‌త వేటు వేస్తాన‌ని చెప్పిన మాట‌లు వారిని వెంటాడుతున్నాయి.


కొంద‌రు ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్లేందుకు రెడీగా ఉన్నా.. పార్టీ మారే వారు పార్టీతో పాటు త‌మ ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేయాల‌న్న కండీష‌న్ పెట్ట‌డంతో చాలా మంది ముందుకు.. వెన‌క‌కు ఊగిస‌లాడ ధోర‌ణితో ఉన్నారు. అయితే ప్ర‌కాశం జిల్లా అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్ మాత్రం టీడీపీతో పాటు త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి సైతం రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్లే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని తెలుస్తోంది. 


ర‌వి వైఎస్ అండ‌తో రెండుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ త‌ర్వాత వైసీపీలోకి వెళ్లి 2014లో ఆ పార్టీ నుంచి మ‌రోసారి గెలిచారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. జిల్లాకే చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి ఆయ‌న అత్యంత స‌న్నిహితుడు. ర‌వి టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు రాజ‌కీయ ప‌ర‌మైన ఒత్తిళ్ల‌తోనే పార్టీ మారారే కాని ఆయ‌న‌కు పార్టీ మారేందుకు ఇష్టం లేదు. ఇక ఇప్పుడు టీడీపీతో పాటు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి వైసీపీలోకి రావాల‌ని చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. అదే జ‌రిగితే అద్దంకికి ఉప ఎన్నిక త‌ప్ప‌దు. అద్దంకిలో ర‌వి వ్య‌క్తిగ‌త ఇమేజ్‌తోనే గెలిచాడే త‌ప్పా... అక్క‌డ టీడీపీకి అంత సీన్ లేదు. ఉప ఎన్నిక జ‌రిగినా గెలుపు ర‌విదే అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: