విశాఖ‌ప‌ట్నంపై అధికార పార్టీ గురిపెట్టింది.  నగరంతోపాటు జిల్లాలోనూ వైసీపీ నాయకత్వ స‌మ‌స్య‌తో స తమతం అవుతోంది. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ నేతలను ముందుండి నడిపించడంలో విఫలమవుతున్నారు. త్వరలో జరిగే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా జెండా ఎగరేయాలని భావిస్తున్న వైసీపీ… టీడీపీ నుంచి భారీగా చేరికలను ప్రోత్సహిస్తోంది. 


గతంలో తాము విధించుకున్న లక్ష్మణరేఖ దాటకుండానే చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.  అన్నీ అ నుకూలిస్తే టీడీపీకి చెందిన మాజీ మంత్రితో సహా ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీ తీర్ధం పుచ్చుకునే అ వకాశాలు కనిపిస్తున్నాయి. వీరంతా ఇప్పటికే టీడీపీ వ్యవహారాల్లో అంటీ ముట్టనట్టుగా వ్య‌వహ రిస్తున్నారు. టీడీపీలో ఉంటే తమకు భవిష్యత్తు లేదని భావిస్తున్న వీరంతా త్వరలో వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 


అయితే ఈ ఆప‌రేష‌న్‌ను  పార్టీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ  విజ‌య‌సాయిరెడ్డికి అప్ప‌గించింది వైసీపీ. విశాఖ జిల్లా వ్య‌వ‌హారాల‌ను గ‌త మూడేళ్లుగా ఆయ‌న ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు. చేరిక‌లపై ఆయ‌న  విప‌క్ష టీ డీపీ ఎమ్మెల్యేల‌తో కీల‌క చ‌ర్య‌లు జ‌రుపుతున్నారు. అయితే పార్టీ నేతలైతే రాజీనామా చేసి వైసీపీలో చే రడం ఖాయమే గానీ, ఎమ్మెల్యే పార్టీ మారితే త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల‌నే వైసీపీ కండీష‌న్ వారిని ఆందోళ‌న‌కు గురిచేస్తోంది.  దీంతో వైసీపీలోకి రావాలనుకునే ఎమ్మెల్యేలు ఆలోచ‌న‌లో ప‌డిన‌ట్లు స‌మాచారం. 


ఒక వేళ అన్ని హ‌ద్దులు దాటి , వైసీపీలో చేరిన త‌ర్వాత త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ ఏవిధంగా ఉంటుంది.. పార్టీలో త‌గిన గుర్తింపు, గౌర‌వం ద‌క్కుతాయా.. ప‌ద‌వులు ఇస్తారా.. లేదా.. వంటి అనేక అంశాల‌ను స‌ద‌రు ఎమ్మెల్యేలు పరిగ‌ణ‌లోకి తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం.  అయితే విజయసాయిరెడ్డి మాత్రం స‌ద‌రు ఎమ్మెల్యేల‌కు మైండ్‌వాష్ చేస్తున్నారు. పార్టీ మారితే అన్ని అంశాలు తాము చూసుకుంటామని వారికి భ‌రోసా ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: