ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స‌దావ‌ర్తి భూముల ర‌గ‌డ అంతా ఇంతా కాదు. ఈ భూములు రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లే సృష్టించాయి. స‌దావ‌ర్తి భూముల వ్య‌వ‌హ‌రం టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ న‌డుమ ఓ యుద్ధాన్ని త‌లిపించేలా జ‌రిగిందంటే ఆశ్చ‌ర్యం క‌లుగ‌క‌మాన‌దు. స‌దావ‌ర్తి భూములపై గ‌త నాలుగేళ్ళుగా అటు అసెంబ్లీని, ఇటు రాష్ట్ర రాజ‌కీయాల‌ను ఓ కుదుపు కుదిపాయి. స‌దావ‌ర్తి భూముల‌పై ఆనాడు అధికారంలో  ఉన్న టీడీపీ అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు వైసీపీ ఆరోపించారు. స‌దావ‌ర్తి భూముల‌పై పెద్ద ఎత్తున ఉద్య‌మించారు వైసీపీ నాయ‌కులు.


ఇక ఇప్పుడు అధికారంలోకి వైసీపీ రావ‌డంతో స‌దావ‌ర్తి భూముల అక్ర‌మాల‌పై నిగ్గు తేల్చేందుకు స‌న్న‌ద్దం అయింది. వైఎస్సార్ పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఎమ్మెల్యే ఆళ్ళ రామ‌కృష్ణారెడ్డి అసెంబ్లీలో స‌దావ‌ర్తి భూముల‌పై పెద్ద ఎత్తున్న ప్ర‌భుత్వంలో ఉన్న టీడీపీని ఇరుకున పెట్టెలా ప్ర‌శ్నించాడు. దీనికి అప్ప‌టి టీడీపీ ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున ఈ భూముల‌పై అక్ర‌మాల‌కు పాల్ప‌డింద‌ని, టీడీపీ కి చెందిన నేత‌ల‌కు అప్ప‌నంగా క‌ట్ట‌బెట్టింద‌ని, కోట్ల భూమిని ల‌క్ష‌ల‌తో కాజేశార‌ని ఎమ్మెల్యే రామ‌కృష్ణారెడ్డి విమ‌ర్శ‌లు చేశారు.


వైసీపీ ఎమ్మెల్యే రామ‌కృష్ణారెడ్డి స‌దావ‌ర్తి భూముల‌పై హైకోర్టుకు వెళ్ళడం, అక్క‌డ కూడా స‌దావ‌ర్తి భూముల వ్య‌వ‌హారంలో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని తేల్చి మ‌రోమారు వేలం వేయాల‌ని తీర్పు ఇవ్వ‌డం జ‌రిగింది. అయినా అక్ర‌మాల‌పై టీడీపీ ప‌ట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌డంతో ఇక వైసీపీ అధికారంలోకి రావ‌డంతో స‌దావ‌ర్తి భూముల‌పై వైసీపీ ప్ర‌భుత్వం విజిలెన్స్ విచార‌ణ‌కు ఆదేశిస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది.


త‌మిళ‌నాడులోని స‌దావ‌ర్తి స‌త్రానికి చెందిన 83.11ఎక‌రాలపై జ‌రిగిన అక్ర‌మాలు విజిలెన్స్ విచార‌ణ‌లో తేలిపోనున్న‌ది. స‌దావ‌ర్తి భూముల అక్ర‌మాల‌పై విచార‌ణ‌కు ప్ర‌భుత్వం విచార‌ణ క‌మిటి ఏర్పాటు చేయ‌డంతో టీడీపీ నేత‌ల గుండెల్లో రైళ్ళు ప‌రుగెడుతున్నాయి. ఈ క‌మిటీ అస‌లు విష‌యం నిగ్గు తేలిస్తే టీడీపీ నేత‌లు ప‌లువురు ఇరుక్కుపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: