పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అధికార వైసీపీలో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. నియోజకవర్గానికి పాత ఇన్ చార్జ్ ని తప్పించి కొత్త ఇన్ చార్జ్ రావడంతో పార్టీలో గ్రూపులు మొదలవుతున్నాయి. దీంతో కార్యకర్తలు అయోమయానికి గురవతున్నారు. తాము ఏ నాయకుడు వైపు వెళ్లాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే ఇంతలా కార్యక్ర్తలు కన్ఫ్యూజ్ అవుతూ గ్రూపులు ఏర్పడే స్థితికి రావడానికి కారణాలని ఒక్కసారి పరిశీలిస్తే.


ఇటీవల ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం వైసీపీ గాలి వీచిన పాలకొల్లులో మాత్రం విజయం అందలేదు. ఇక్కడ నుంచి టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు మరోసారి గెలిచారు. అయితే ఎన్నికల సమయంలో  గుణ్ణం నాగబాబుకు అసెంబ్లీ టికెట్‌ దక్కకపోవడంతో పార్టీని వదలి జనసేనకు వెళ్ళి అక్కడ నుంచి పోటీ చేశారు.  ఇక చివరి నిమిషంలో పార్టీలోకి ఎంట్రీ ఇచ్చి టికెట్ దక్కించుకున్న డాక్టర్‌ సీహెచ్‌ సత్యనారాయణమూర్తి (బాబ్జీ) ఎన్నికలలో పరాజయం పాలయ్యారు. 


ఇక ఓటమి చెందినప్పటికీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థినే నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా డాక్టర్‌ బాబ్జీనే ఇప్పటి వరకు కొనసాగించారు. కానీ హఠాత్తుగా బాబ్జీకి షాక్ ఇస్తూ ఆయన్ని ఇన్ చార్జ్ పదవి నుంచి తొలగించారు. కాకపోతే ఆయన ప్లేసులో బీసీ నాయకుడుకు పదవి ఇవ్వాలని కొందరు వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. కానీ ఊహించని విధంగా ఆచంట నియోజకవర్గ నాయకుడు కవురు శ్రీనివాస్‌ను నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించేశారు. 


దీంతో పాలకొల్లు పార్టీ శ్రేణులు షాక్ తిన్నాయి. పార్టీలో కీలకంగా ఉన్న యడ్ల తాతాజీకి ఇన్‌ఛార్జ్‌ పదవి దక్కుతుందని వారు ఆశించారు. అయినప్పటికీ అలా జరగకపోవడంతో ఆయన వర్గీయులు నిరాశ చెందినట్లు సమాచారం. ఎన్నికల ముందు పార్టీ కోసం కష్టపడ్డ గుణ్ణం నాగబాబుకు టికెట్ ఇవ్వలేదని, పోనీ ఎన్నికల్లో ఓడిపోయిన డాక్టర్ బాబ్జీని అయిన ఇన్ చార్జిగా కొనసాగిస్తారు అనుకుంటే అలా కూడా జరగలేదని. అటు తాతాజీని పక్కనబెట్టేశారని స్థానిక శ్రేణులు నిరాశలో ఉన్నాయి. 


పైగా కొత్త ఇన్ చార్జ్ కు మద్దతు ఇవ్వాలో లేక పాత నేతల వెంట నడవాలో అర్ధం కావట్లేదు. మొత్తం మీద ఈ పరిణామాలతో పాలకొల్లు వైసీపీలో గ్రూపులు ఏర్పడుతున్నాయని అంటున్నారు. మరి ఈ గ్రూపు రాజకీయాలకు అధినేత జగన్ ఎలా చెక్ పెడతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: