తెలుగు రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరావు. ఎన్టీఆర్ కు పెద్దల్లుడిగా, మాజీ సీఎం చంద్రబాబుకు తోడల్లుడుగా దగ్గుబాటి వెంకటేశ్వరావుకు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉంది. మాజీ మంత్రి అయిన దగ్గుబాటి వెంకటేశ్వరావు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలోనే రాజకీయాలకు స్వస్తి పలికారు. ఆయన సతీమణి మాజీ కేంద్రమంత్రి పురంధరేశ్వరి పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్నా ఆయన మాత్రం సైలెంట్ గా ఉంటూ వచ్చారు. రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయానికి దగ్గుబాటి వెంకటేశ్వరావు తన కుమారుడు హితేష్ చెంచురాం ని రాజకీయాల్లోకి దించారు. హితేష్ చెంచురాం ని వైసిపిలో చేర్చి తన సొంత నియోజక వర్గం పర్చూరు నుండి పోటీ చేయించటానికి సిద్ధమయ్యారు.



అయితే హితేష్ కు అప్పటికే ఉన్న అమెరికా పౌరసత్వం రద్దు కాకపోవడంతో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. అప్పటికే హితేష్ కు టికెట్ కన్ఫర్మ్ చేసి ఉన్న వైసిపి దగ్గుపాటి వెంకటేశ్వరావుకి ఆఫర్ ఇచ్చింది. పరిస్థితుల ప్రభావంతో దగ్గుబాటి మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టాల్సి వచ్చింది. ఎన్నికల సమయంలో చివరి నిమిషంలో ఆయన పోటీకి దిగారు. సొంత నియోజక వర్గం నుంచి తన రాజకీయ జీవితంలో మొదటి సారి ఓటమి పాలయ్యారు. రాజకీయమైనా, ఎన్నికలైనా సైలెంట్ గా చేయడం దగ్గుబాటి వెంకటేశ్వరావు స్టైల్. ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజక వర్గ ఇన్ చార్జిగా పార్టీ బాధ్యతలు ప్రభుత్వ అధికారుల బదిలీలు ఇతర బాధ్యతలను ఆయనే పర్యవేక్షించారు.



ఆ క్రమంలో ఇటీవల వైసీపీ అధిష్టానం పర్చూరు నియోజక వర్గంలో దగ్గుబాటి వెంకటేశ్వరావు పనితీరు పై ఇటీవల ఆరా తీసిందట. దగ్గుబాటి వెంకటేశ్వరావు నియోజకవర్గంలో ఉంటున్నారా, పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారా, క్యాడర్ తో ఎలా ఉంటున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమైన మాట్లాడుతున్నారా అని వైసిపి అధిష్టానం ఎంక్వేరీ చేసిందంటా. ఇప్పుడు ఆ సంఘటన అదే జిల్లాలో అధికార వైసిపితో పాటు టిడిపిలో కూడా హాట్ టాపిక్ గా మారింది.దగ్గుబాటి వెంకటేశ్వరావు గురించి వైసిపి అధిష్టానం ప్రత్యేకంగా ఎందుకు ఆరా తీసిందా అని రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. దగ్గుబాటి భార్య పురంధరేశ్వరి ఏపీ బీజేపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కేంద్రమంత్రిగా పురంధరేశ్వరి పని చేశారు.



రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో పురందేశ్వరి బీజేపీలో చేరారు. అప్పటి నుంచి బీజేపీలో పురంధరేశ్వరి యాక్టివ్ గా పనిచేస్తున్నారు.గత కొంతకాలంగా బీజేపీ నేతలు వైసిపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఒక రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. పురంధరేశ్వరి సైతం వైసిపి ప్రభుత్వం పని తీరు పై విమర్శలు చేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని దగ్గుబాటి వెంకటేశ్వరావు కూడా ప్రభుత్వం పై ఏమైనా అసంపూర్తిగా మాట్లాడుతున్నారా పార్టీ కేడర్ తో సన్నిహితంగా ఉంటున్నారా లేదా అని వైసీపీ అధిష్టానం ఆరా తీసిందట. కొడుకును రాజకీయంగా నిలబెట్టడానికి తమ నేత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి కష్టపడుతుంటే ఈ ఎంక్వైరీ లేంటని దగ్గుబాటి అనుచర వర్గం వాపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: