సినిమా వాళ్ళతో కధ నడిపిస్తే బాగానే ఉంటుంది. అయితే వారిని సరైన విధంగా డైరెక్షన్ చేసే సూపర్ హిట్లు కొట్టగలరు ఎవరైనా.  రాంగ్ గైడెన్స్ ఉంటే మాత్రం బొమ్మ బొల్తా పడుతుంది. రాజకీయ తెర మీద అయితే  ఎంతటి హీరో ఐనా సరైన డైరెక్షన్  ఉండాలి. జనసేనాని పవన్ కి హీరో మెటీరియల్ ఉంది. అందుకే ఆయన సెల్యూలాయిడ్ మీద భారీ హిట్లు కొట్టారు, కోట్లాది మంది అభిమానులు ఆయనకు ఉన్నారు. మరి రాజకీయాల్లో పవన్ తానే హీరో, తానే డైరెక్టర్ గా తాజా ఎన్నికల్లో దిగారు. రిజల్ట్ తేడా కొట్టింది. మరి ఇపుడు మార్పు ఉంటుందా.


బీజేపీలో చేరిన మాజీ టీడీపీ తమ్ముడు ఓ మాట చెప్పాడు. చెప్పడమేంటి సంచలనం రేపాడు. ఆయనే గుంటూరు జిల్లాలు చెందిన మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్  ప్రభాకర్. ఆయన చెప్పింది నిజమైతే మాత్రం ఏపీ రాజకీయాల్లో సంచలనాత్మకమైన మార్పులు వస్తాయి. పవన్ బీజేపీలో చేరిపోతారని, ఆయన జనసేన పార్టీని ఈ డిసెంబర్లో విలీనం చేస్తారని ప్రభాకర్ అన్నారు. ఇది నిజంగా బాంబు కంటే పవర్ ఫుల్ వార్తే.


ఓ వైపు తాను ఎన్ని కష్టాలు ఓర్చినా సరే జనసేనను కొనసాగిస్తానని పవన్ అంటూంటే బీజేపీలో కొత్త పూజారి ప్రభాకర్ ఇలా అనడమేంటి అన్న అనుమానాలు వస్తున్నాయి. అయితే తెర వెనక రాయబేరాలు సాగుతున్నాయని తెలుస్తోంది. మరి పవన్ ఈ మధ్య బీజేపీకి అనుకూలంగా మాట్లాడిన మాటలను బట్టి చూస్తే ఆయన కొంత సానుకూలంగా ఉన్నారనే అంటున్నారు.


అయితే పవన్ తన జనసేనను విలీనం చేస్తారా అన్న దాని మీదనే డైలామా అంటున్నారు రాజకీయ పండితులు. పొత్తులకు పవన్ ఆసక్తి చూపిస్తే విలీనం అని బీజేపీ అంటోందని కూడా చాలా కాలం క్రితమే వార్తలు వచ్చాయి. పవన్ సైతం తన పార్టీపై వత్తిళ్ళు వస్తున్నాయని చెప్పుకున్నారు. ఇపుడు ప్రభాకర్ మాత్రం కచ్చితంగా ముహూర్తం కూడా చెప్పేస్తూ డిసెంబర్లో పవన్ పార్టీని విలీనం చేస్తారని అనడం బట్టి చూస్తూంటే ఏమో ఏదైనా రాజకీయాల్లో జరగవచ్చు అనిపిస్తోదంటున్నారు.


ఒకవేళ పవన్ బీజీపీలో చేరితే ఆయనే ఏపీకి సీఎం అభ్యర్ధి అని కూడా అన్నం ప్రభాకర్ అంటున్నారు. ఎవరు ఏమన్నా పవన్ కి ఫ్యాన్స్ ఉన్నారు. జనంలోనూ బలముంది. దాన్ని రాజకీయాల్లోకి మళ్ళించుకుని ఓట్లు పొందే సత్తా బీజేపీకి ఉంది. పవన్ కనుక బీజేపీలో చేరితే రెండు పార్టీలకు లాభమే కానీ. జనసేనాని ఈ కామెంట్స్ మీద ఎలా స్పందిస్తాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: