ప్రస్తుతం దేశంలో వాహన చట్టం అమలులో ఉన్నది.  వాహనాలు నడిపే వ్యక్తులు తప్పని సరిగా హెల్మెట్ పెట్టుకోవాలి.  హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే నేరం అవుతుంది.  ఫైన్  కట్టాల్సి వస్తుంది.  ఇప్పటి వరకు ఫైన్ అంటే చాలా నార్మల్ గా ఉండేవి.  కానీ, ఇప్పుడు ఫైన్ కట్టడం అంటే మాములు విషయం కాదు. వేల రూపాయల ఫైన్ కట్టాలి.  ఇలా కట్టుకుంటూ పొతే చివరకు జీతం మొత్తం ఇలా ఫైన్ కట్టడానికే సరిపోతుంది.  


ఇదిలా ఉంటె, నిన్న లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీ చేయడానికి రెడీ అయ్యారు.  దానికి పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి లేదు.  పైగా ర్యాలీ చేయడానికి వచ్చిన బైకర్స్ దగ్గర హెల్మెట్ లేదు.  హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే కొత్త చట్టం ప్రకారం 1000 రూపాయలు ఫైన్ కట్టాలి.  ఆ స్థాయిలో ఫైన్ ఉంటుంది.  అలాంటప్పుడు అంత ఫైన్ కట్టగలరా.. పార్టీ కోసం పనిచేసే వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉంటుందా.. అంటే ఉండదని చెప్పాలి.  


అందుకే లోకేష్ అలోచించి బైక్ ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకు హెల్మెట్ లను పంచారు.  హెల్మెట్ పెట్టుకొని ర్యాలీ చేశారు.  ఏదైతేనేం తెలుగు తమ్ముళ్లకు లోకేష్ హెల్మెట్ కొనిచ్చి వారిని ఫైన్ బారి నుంచి కాపాడాడు.  దీనిపై సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.  లోకేష్ ప్రతి పట్టణంలో బైక్ ర్యాలీ ఏర్పాటు చేయాలని యువత కోరుకుంటున్నట్టు ట్రోల్ చేస్తున్నారు.  


కొత్త చట్టం అమలులోకి వచ్చిన తరువాత, రాష్ట్రంలో హెల్మెట్ కొరత ఏర్పడింది.  250 రూపాయలు ఉండే హెల్మెట్ ధర ఇప్పుడు వెయ్యి రూపాయల వరకు వెళ్ళింది.  అంతేకాదు, వెయ్యి పెట్టినా కావాల్సిన హెల్మెట్ దొరుకుతుందనే గ్యారెంటీ లేదు.  అందుకే లోకేష్ లాంటి వ్యక్తులు ప్రతి పట్టణంలో బైక్ ర్యాలీ ఏర్పాటు చేస్తే.. పార్టీలతో సంబంధం లేకుండా యువత బైక్ ర్యాలీలో పాల్గొంటారు అనడంలో సందేహం అవసరం లేదు.  మరి లోకేష్ ఈ విషయంలో ఎలా ఆలోచిస్తారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: