రాష్ట్రంలో నిజంగా ప్రజలు సమస్యలు పడుతుంటే .. విపక్షంలో ఉండి అధికార పార్టీని నిలదీయటంలో తప్పు లేదు. కానీ ఎక్కడ ప్రజలు తమను మరిచిపోతారేమోనని సంకుచిత రాజకీయాల కోసం అధికార పార్టీ మీద చీటికీ మాటికీ వ్యాఖ్యలు చేస్తే ప్రజల్లో పలచన పడిపోతారు. ఇప్పుడు ఏపీలో జరుగుతున్నది అదే. జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ప్రజలు సంతోషంగానే ఉన్నారు. కానీ ప్రతి విషయానికి రాజకీయ రంగు పులిమి ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తే మళ్ళీ ప్రతి పక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆపార్టీ పరిస్థితి గత 30 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఘోరంగా క్షేత్ర స్థాయిలో దెబ్బతినిందంటే అతిశయెక్తి కాదని చెప్పాలి.


ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత అధినేత చంద్రబాబుతో పాటు ఆపార్టీ కార్యకర్తలు కూడా పెద్ద షాక్ కు గురయ్యారు. నిజానికి టీడీపీ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను ఆ పార్టీ అధినేత పసిగట్టలేకపోయారు. చేసిన తప్పులను పదే పదే చేసుకుంటూ పోయారు. దీనితో ఆ పార్టీ ఎప్పుడు చూడలేనంతగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎన్నికల్లో తమ పార్టీ ఘోరంగా ఓడిపోయిన తరువాత ప్రజల్లో సింపతీని పొందడానికి తండ్రి కొడుకులు పడరాని పాట్లు పడుతున్నారు.


జగన్ మీద అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తూ నవ్వుల పాలవుతున్నారు. ట్విట్టర్ లో ఒకరు మించి ఒకరు కామెడీని పండిస్తున్నారు. వీరు చేస్తున్న పనులు మైలేజీ తీసుకురావటం కాదు కదా జనాల్లో కమెడియన్స్  గా మార్చెస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా ప్రతి పక్ష హోదాకు పరిమితం అవ్వటంతో అధికార పార్టీ మీద ఏది పడితే అది మాట్లాడతూ చంద్రబాబు జనాల్లో పలచన అయిపోతున్నారు. అయినా జగన్ మీద ఎదురు దాడికి దిగితేనే పార్టీ బతుకుతుందని బాబు భావిస్తున్నట్టున్నారు !

మరింత సమాచారం తెలుసుకోండి: