తెలుగు దేశం పార్టీలో ఎంతోమంది నాయకులూ ఉన్నప్పటి చంద్రబాబు అంత బలమైన నాయకుడు ఎవరు లేరు. చంద్రబాబు అంతటి బలమైన నాయకుడు అతని పుత్రుడైన ఉంటాడా అని అనుకుంటే ? జయంతిని వర్ధంతి చేసే అంత తెలివైన కుమారుడు నారా లోకేష్. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి చేతిలో ఉన్న నిండు సభల్లో ఫుల్ కామెడీ చేసి వార్తల్లో నిలిచేవాడు. 


ఇప్పుడు ట్విట్టర్ లో ట్విట్ పెడుతూ ట్విట్టర్ పిట్టా అని అనిపించుకుంటున్నాడు. ఇక విషయానికి వస్తే .. తెలుగు దేశం పార్టీ ఉండాలంటే ఎన్టీఆర్ సినిమాలకు టాటా చెప్పి రాజకీయాల్లో రావాలని, ఎన్టీఆర్ ఏ టీడీపీ పార్టీని కాపాడగలడాని మొన్న ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. 


చాల మంది సోషల్ మీడియా వేధికగా ఎన్టీఆర్ అధికారంలోకి రానున్నాడని అసెంబ్లీలో కూర్చున్న కొన్ని ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేశారు నెటిజన్లు. అయితే ఎన్టీఆర్ గురించి బాగా తెలిసిన కొంతమంది అభిమానులు మాత్రం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాడు. అతను సినిమాని వదలడు అని అంటున్నారు. అయితే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడా లేదా అనేది ఇంకా తెలియలేదు కానీ.. 


ఆ ఊహ మాత్రం బాలయ్య అల్లుళ్లకు భయాన్ని పుట్టించింది. అందుకే మొన్న చిన్నల్లుడు శ్రీ భరత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ టీడీపీకి అవసరం లేదు అని అన్నట్టే.. ప్రస్తుతం విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న నారా లోకేష్ కూడా ఎన్టీఆర్ ఎంట్రీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. టీడీపీలోకి ఎన్టీఆర్ ఎంట్రీపై మీ స్పందనేంటి అని నారా లోకేష్ ని ప్రశ్న అడగగా.. 


ఆ ప్రశ్నకు నారా లోకేష్ సమాధానమిస్తూ.. టీడీపీ ఎన్టీఆర్ సొత్తు కాదు.. పార్టీ కోసం పని చేసే వాళ్ళు చాలామందే ఉన్నారు. ఈ పార్టీ కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరైనా వచ్చి పని చెయ్యచ్చు. అలానే ఎన్టీఆర్ కూడా అంటూ సమాధానం ఇచ్చాడు. అయితే లోకేష్ సమాధానం విన్న ప్రజలు స్పందిస్తూ 'ఇలా మాట్లాడిన వారే పార్టీ నిలబడటం కోసం ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకుంటారు' అంటూ కామెంట్లు పెడుతున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: