గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మీరాలం ట్యాంక్ పార్కులో రూ.2.90 కోట్ల వ్యయంతో  మల్టీ మీడియా మ్యూజికల్ ఫౌంటెన్ ను ఏర్పాటు చేయనున్నట్టు జీహెచ్ ఎంసీ మేయర్  బొంతు రామ్మోహ‌న్ తెలిపారు. మ్యూజిక్, డ్యాన్సింగ్ లతో కూడిన వాటర్   ఫౌంటెన్ ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. దుర్గం కేబుల్ బ్రిడ్జిపై రూ.5.10 కోట్ల వ్యయంతో ప్రత్యేక లైటింగ్ ను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలతో సహా మొత్తం 13 తీర్మానాలను స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదించారు. గురువారం న‌గ‌ర మేయ‌ర్  రామ్మోహ‌న్ అధ్యక్షతన  స్టాండింగ్ క‌మిటీ స‌మావేశం జరిగింది. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డి.ఎస్.లోకేష్ కుమార్ తోపాటు  స్టాండింగ్ క‌మిటీ స‌భ్యులు చెరుకు సంగీత ప్రశాంత్‌గౌడ్‌, మహ్మద్ అబ్దుల్ రహమాన్, ముస్తఫా అలీ, మిస్ బా ఉద్దీన్, మాజిద్ హుస్సేన్, ఎం.మమత, మహ్మద్ అఖీల్ అహ్మద్, షేక్ హమీద్, తోట అంజయ్య, సబీహా బేగం, రావుల శేషగిరి, సామల హేమ లు పాల్గొన్నారు. చార్మినార్ జోన్ లోని మీరాలం ట్యాంక్ పార్కు అభివృద్దిలో భాగంగా రూ.2.90 కోట్ల వ్యయంతో మల్టీ మీడియా, సంగీత, నృత్య లైటింగ్ తోకూడిన వాటర్ ఫౌంటెన్ ఏర్పాటుతో పాటు దీనికి టెండర్లను పిలిచే తీర్మానానికి ఆమోదం లభించింది.





దుర్గం చెరువు కేబుళ్లు, బ్రిడ్జి టవర్లపై ఆర్కెటెక్చురల్ ఆధునిక లైటింగ్ ఏర్పాటును రూ. 5.10 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసేందుకు పరిపాలన సంబంధిత తీర్మానానికి ఆమోదించారు. సికింద్రాబాద్ జోన్ లోని గాంధీనగర్ నాలా ఆధునీకరణలో భాగంగా అసంపూర్తిగా ఉన్న స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణాన్ని రూ. 7.75 కోట్లతో చేపట్టేందుకు ఆమోదం లభించింది. మలక్ పేట్ లోని నేషనల్ సెన్సోర్ పార్కును నిర్వహించిన స్వచ్ఛంద సంస్థ ఆయేషా ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కు నిర్వహణ చార్జీల నిమిత్తం రూ. 21.15లక్షలను విడుదల చేస్తూ ఈ సంస్థ సర్వీసులను మరో ఏడాది పాటు కొనసాగించే తీర్మానానికి ఆమోదించారు. జిహెచ్ఎంసి కార్యాలయాల రూఫ్ టాప్ లో ఏర్పాటు చేయనున్న సోలార్ విద్యుత్ ను 941 కే.వి పవర్ సోలార్ గ్రిడ్ కు అనుసంధానం చేస్తూ ఐదేళ్ల పాటు నిర్వహించేందుకు ప్రభుత్వ సంస్థ టి.ఎస్.ఆర్.ఇ.డి.సి.ఓ ద్వారా క్యాపెక్స్ మోడల్ ఏజెన్సీకి అందించేందుకు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. 






నగరంలోని పలు ప్రధాన మార్గాల్లో ప్లాస్టిక్ పెట్ బాటిళ్ల ష్రెడ్డింగ్ మిషన్లను కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బులిటి కింద ఐరావత్ మిషన్లను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలకు గ్రీన్సిగ్నల్ లభించింది. శేరిలింగంపల్లి సర్కిల్ లోని మైండ్స్ స్పేస్ అండర్ పాస్ వద్ద సెంట్రల్ మీడియన్, ఐల్యాండ్ లను సి.ఎస్.ఆర్ కింద నిర్వహించేందుకు సంవత్సరం పాటు మేసర్స్ సింక్రాని ఇంటర్నేషనల్ సర్వీసెస్ కొనసాగించే తీర్మానాన్ని ఆమోదించారు. అటవీ, ఉద్యానవన శాఖలలో పదవీవిరమణ పొందిన 12మంది అధికారులను అర్బన్ బయోడైవర్సిటీ విభాగంలో ఔట్ సోర్సింగ్ పద్దతిలో ఉపయోగించుకునే ప్రతిపాదనలకు ఆమోదం. జిహెచ్ఎంసి పరిధిలో గార్బేజ్ ను పలు ట్రాన్స్ ఫర్ స్టేషన్ల నుండి తరలించేందుకు గాను ఉపయోగిస్తున్న వాహనాలకు రూ. 3,35,69,250 లను శ్రీ రాజరాజేశ్వరి ఎంటర్ ప్రైజెస్ కు చెల్లించడంతో పాటు ఈ ఏజెన్సీ ని 31-12-2019 వరకు కొనసాగించే ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. 2018-19 సంవత్సరానికి బడ్జెట్ సవరణల ప్రతిపాదనలకు స్టాండింగ్ కమిటీ  ఆమోదించింది.





టౌన్ ప్లానింగ్ విభాగంలో రిటైర్డ్ టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ ఏ.ప్రభాకర్ రావు సేవలను కాంట్రాక్ట్ పద్దతిపై నెలకు రూ.25వేల చొప్పున 2020 జూలై వరకు ఉపయోగించుకునే ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.  మల్కాజ్ గిరి సర్కిల్ లో రోడ్డు విస్తరణ పనులకుగాను రిటైర్డ్ ఉద్యోగి బి.దిలీప్ కుమార్ ను నెలకు రూ. 20వేల వేతనంతో కాంట్రాక్ట్ పద్దతిన నియమించే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. జిహెచ్ఎంసి ఆదాయ వ్యయాలకు సంబంధించి 15-08-2019 వరకు జరిగిన వివరాల సమాచారం స్టాండింగ్ కమిటిలో ప్రవేశపెట్టారు. ఈ సమావేశానికి  జీహెచ్ఎంసీ అధికారులు అద్వైత్‌కుమార్ సింగ్, సందీప్‌జా,  శృతిఓజా, కెన‌డి, కృష్ణ, జోన‌ల్ క‌మిష‌న‌ర్లు హరిచందన, శ్రీ‌నివాస్‌రెడ్డిలు, శంక‌ర‌య్య‌, మమత, సి.ఇ.శ్రీధర్, సిసిపి దేవేంద‌ర్‌రెడ్డి, సి.వి.ఓ వెంకటేశ్వర్ రెడ్డి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: