జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని  ఎన్ని రకాలుగా గబ్బు పట్టించచ్చో అన్ని రకాలుగాను చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారు.  ఇందులో భాగంగానే గుంటూరు జిల్లాలో వైసిపి బాధితుల శిభిరమనే కొత్త డ్రామాను మొదలుపెట్టారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చాలా జిల్లాల్లోని చాలా గ్రామాల్లో టిడిపి కార్యకర్తలపై వైసిపి నేతల దాడులు పెరిగిపోతున్నాయట.

 

జగన్ వంద రోజుల పరిపాలనలో టిడిపికి సంబంధించి సుమారు 400 అరాచకాలు జరిగాయంటూ పెద్ద ఆరోపణలే చేశారు. ఇదే విషయమై చంద్రబాబు, చినబాబులు ప్రతిరోజు ట్విట్టర్ వేదికగా గగ్గోలు పెట్టేస్తున్నారు. సరే ఇదంతా నిజమేనా అని కాస్త ఆరాతీస్తే చంద్రబాబు చెబుతున్నదాంట్లో చాలా వరకూ అబద్ధాలే అని తేలిపోయింది.

 

కొన్ని గ్రామాల్లో వైసిపి-టిడిపి కార్యకర్తల మధ్య గొడవలు జరిగిన మాట వాస్తవమే. అయితే వాటిల్లో చాలా వరకూ పార్టీ పరంగా జరిగిన గొడవలకన్నా వ్యక్తిగత కక్షలతో జరిగినవే ఎక్కువ.  ఇక మాజీ ఎంఎల్ఏలు, నేతలపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందంటూ చంద్రబాబు ఒకటే గోల చేస్తున్నారు. మాజీ ఎంఎల్ఏలు కాన రవికుమార్, చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్ళ నోటి దురుసు వల్లే కేసులు నమోదయ్యాయి. మాజీ మంత్రి సోమిరెడ్డిపై కోర్టు ఆదేశాలతో కేసు నమోదైంది.

 

ఇన్ని మాటలు మాట్లాడుతున్న చంద్రబాబు తన హయాంలో వైసిపి నేతలపై టిడిపి నేతలు చేసిన ధౌర్జన్యాల గురించి మరచిపోయినట్లున్నారు. అనంతపురంలో ఓ నేతను ఎంఆర్వో కార్యాలయానికి పిలిపించుకుని మరీ హత్య చేశారు. కర్నూలులో చెఱుకులపాడు నారాయణరెడ్డిని రోడ్డు మీదే హత్యచేయటం నిజం కాదా ?

 

ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, తాడిపత్రి నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి లాంటి వాళ్ళను ఎన్నిసార్లు రిమాండ్ కు పంపారో చంద్రబాబుకు గుర్తులేదా ? సోషల్ మీడియాలో తన ప్రభుత్వాన్ని విమర్శించారనే కారణంతో కనీసం 10 మందిని చంద్రబాబు జైలుకు పంపుంటారు. ప్రతీ యాక్షన్ కు ఓ రియాక్షన్ ఉంటుందన్న సహజ సూత్రాన్ని చంద్రబాబు మరచిపోతే ఎవరూ ఏమీ చేయగలిగేదేం లేదు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: