వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి  దూకుడును ఎలాగైనా తగ్గించాలని బాబుగోరు తన బుర్రకి బాగానే పని చెబుతున్నాడు. రోజురోజుకి బాబు యాక్టివ్ గా మారుతున్నాడు, జగన్ ప్రభుత్వం పై ఇప్పటికే పదునైన ఆరోపణలతో విరుచుకుపడుతున్నాడు. అసలుకే అపారమైన అనుభవమైన ఉన్న బాబు నుండి ప్లాన్ వచ్చిందంటే.. ఖచ్చితంగా అది జగన్ ప్రభుత్వానికి  అపాయకరమైనదే అయి ఉంటుంది. జగన్ కి కూడా ఈ విషయం తెలుసు. అందుకే బాబు చేస్తోన్న ఆరోపణల పై తన నాయకుల చేత వివరణ ఇప్పించి బాబును విమర్శించే కార్యక్రమాలను షురూ చేశాడు.  ప్రస్తుతం జగన్,  బాబు అమరావతి భూముల విషయంలో అవినీతి చేసారని.. ఆ అవినీతిని నిరూపించే   ప్రణాళికాల్నే అమలు పరుస్తునట్లు తెలుస్తోంది.  అయితే కొందరి టీడీపీకి సంబంధించిన ప్రభుత్వ అధికారులు నుండి మాత్రం జగన్ ప్రభుత్వంలో హామీల బడ్జెక్ట్ విషయంలో  అలజడి మొదలయిందని  లీకులు ఇస్తున్నారు.  ఇక ఇప్పటికే  జగన్ దూకుడు కి అడ్డుకట్టవేసి,  జగన్ సర్కార్ పాలన పూర్తిగా విఫలం అయిందని.. నింద మోపి  జనంలో తాను క్రెడిట్  కొట్టేయాలని బాబుగోరు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.  అందులో భాగంగానే తన మీడియా చేత ఇప్పటికే  రాతలు రాపిస్తున్నారు. 

ఆ రాతలను బలం చెయ్యటానికి బాబు కూడా సోషల్ మీడియాలో ట్విట్లు చేస్తూ వస్తున్నారు. మరి బాబు ప్రయత్నాలు ఫలిస్తాయా ? జగన్ కంటే బాబునే  బెటర్ అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతారా ?  కానీ గత ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టాక.. కొత్త జగన్ ను పరిచయం చేస్తూ.. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు.  అన్నిటికి మించి అవినీతిరహిత పాలన అందించాలని జగన్ పట్టుదలగా ఉన్నాడు. పైగా ఇప్పటికైతే జగన్ మీద వ్యతిరేఖత లేదు.. కానీ ఇసుక మీద ఆధారపడ్డ కార్మికులు, ఐదు రూపాయిల భోజనం కోరుకున్నే  నిరుపేద కుంటుంబాలు మాత్రం జగన్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి.  వారి అసంతృప్తిల నివారణకు జగన్ ఇప్పటికే చర్యలు చేపట్టాడు.  అయితే ఎలాగైనా జగన్ ను దెబ్బ కొట్టాలని  బాబుగోరు సిద్ధం చేస్తున్న  ప్రణాళికలు,  జగన్ ను  ఎంత వరకు దెబ్బ కొడతాయో..  బాబును జగన్ ఎలా తట్టుకుంటాడో చూడాలి.   


మరింత సమాచారం తెలుసుకోండి: