చేతిలో అధికారం ఉంటే ఏంచేసిన చెల్లుద్ది అనే కాలం పోయినట్లువుంది.ఎందుకంటే చట్టం ఎవరికి చుట్టం కాదని అప్పుడప్పుడు కొందరు అధికారులు నిరూపిస్తున్నారు. శిక్షణ ఇచ్చేవాడే క్రమ శిక్షణ తప్పిదే ఫలితం ఇలాగె వుంటుందని నిరూపించారు.ఒక బాధ్యత గల వ్యక్తి నలుగురికి చెప్పేముందు తను ఆలోచించి చెబితే,వినేవారు కూడా తప్పక వింటారని నిజాయితీ గల పోలీసులు ఫ్రూ చేసుకుంటున్నారు.ఇకపోతే ఇప్పుడు ప్రజలను బెంబేలెత్తిస్తూ,అతలా కుతలం చేస్తున్న సమస్య జరిమానాలు అనే కాన్సెప్ట్. దీనికి భయఫడి ఇప్పటికే పేపర్స్ లేనివారు చక్కగా తుడిచి ఇంట్లో దాచుకుంటున్నారేమో అనిపిస్తుంది.ఇక ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ వాళ్లు ఇది మాయింటి చుట్టమే కదా,చలాన్లు రాసేది మేమేకదా అని ధీమాగా ఉంటున్నారు కాని ఆ ధీమా పనిచేయదని జార్ఖండ్‌ పోలీస్ అధికారులూ నిరూపించారు.



మనవాడు అని జాలి పడి వదిలి పెట్టలేదు.నిజంగా దేశమంతటా ఇలాగే రూల్స్ పాటిస్తే ఎంతబాగుంటుంది అనుకునేలా వున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం..కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మోటార్ వెహికిల్ చట్టంతో సామాన్యులు పరెషాన్ అవుతుండగా,వారి లిస్ట్‌లో తాజాగా పోలీసులు కూడా చేరారు.హెల్మెట్ ధరించని కారణంగా ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌కు రూ. 34 వేలు ఫైన్ విధించారు.రాంచీలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రాకేష్ కుమార్‌ అనే వ్యక్తి హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపారు.దీన్ని గమనించిన ఉన్నతాధికారులు అతనికి రూ.34వేల ఫైన్ విధించారు. కాగా..కొత్త చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారమే రాకేష్ కుమార్‌కు రెండింతల ఫైన్ వేశామని అధికారులు తెలిపారు.



రాకేష్ కుమార్ హెల్మెట్ ధరించకపోవడంతోపాటు చట్టంలోని ఇతర నిబంధనలనూ ఉల్లఘించారని చెప్పారు. కాగా..కొత్త మోటారు వెహికిల్ చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇదే ప్రథమం.నిజంగా చలాన అనే బెత్తం చేతిలో వుందని ప్రజలను బాదుడు కాదు,అధికారులు,మీ జేబులకు కూడా రెక్కలొస్తాయని నిరూపించిన ఈ సంఘటన గురించి తెలిసిన వారు అక్కడి పోలీసులను మెచ్చుకోలేక ఉండలేక పోతున్నారు..చట్టాన్ని అమలు చేస్తే ఇలాగే అందరికి సమానంగా న్యాయం చేసేలా ప్రవర్తించాలంటున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్న వారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: