జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వైసిపి నేతలను  చంద్రబాబునాయుడు ఆంబోతులుగా ఆరోపించటంపై  పెద్ద చర్చ జరుగుతోంది. చంద్రబాబు ఆరోపణలకు కారణాలు ఏమిటయ్యా అంటే టిడిపి నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారట. ఇంతటి అరాచక ప్రభుత్వాన్ని తన 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో చూడలేదు కాబట్టి  జగన్ ప్రభుత్వం ఆబోతులాగే వ్యవహరిస్తోందంటూ తేల్చేశారు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం  ఏమిటంటే అసలు ఆబోతులు ఏ పార్టీలో ఉన్నాయి ? అన్నదే పెద్ద ప్రశ్న.  నిజానికి చంద్రబాబు ఆరోపిస్తున్నట్లుగా నేతలు, కార్యకర్తలను వైసిపి నేతలు ఎక్కడా టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నట్లు లేదు. ఏదైనా గ్రామంలో రెండు పార్టీల మధ్య గొడవలు జరుగుతున్నాయంటే ఎక్కువ భాగం వ్యక్తిగత కక్షలే ప్రధాన కారణమని తెలుస్తోంది.

 

ఇక మాజీ ఎంఎల్ఏలపై కేసులు నమోదవుతున్నాయంటే అవి వాళ్ళ ఓవర్ యాక్షన్ ఫలితంగానే నమోదవుతున్నాయి. అంతేకానీ చంద్రబాబు చెబుతున్నట్లు ప్రభుత్వం వెతికి వెతికి మరీ చింతమనేని ప్రభాకర్ మీదో లేకపోతే కూన రవికుమార్ మీదో కేసులు పెట్టలేదు. ఇక ఆబోతుల విషయానికి వస్తే టిడిపి హయాంలోనే ఎక్కువమంది ఆబోతుల్లాగ ప్రవర్తించిన విషయం అందరికీ తెలిసిందే.

 

అధికారాన్ని అడ్డం పెట్టుకుని అసెంబ్లీ స్పీకర్ గా కోడెల శివప్రసాద్ తో పాటు ఆయన కొడుకు కోడెల శివరామ కృష్ణ, కూతురు విజయలక్ష్మి ఎలా వ్యవహరించారో అందరూ చూసిందే. మాజీ ఎంఎల్ఏలు చింతమనేని ప్రభాకర్, కూన రవికుమార్ తో పాటు చాలామంది మాజీ ఎంఎల్ఏలు, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు జనాలపై ఎలా దౌర్జన్యాలు చేసింది అందరూ చూసిందే.

 

ఇక పరిటాల శ్రీరామ్, బొజ్జల సుధీర్, చింతకాయల విజయ్, కెఇ శ్యాంబాబు లాంటి వారసులు తండ్రుల అధికారాలను అడ్డం పెట్టుకుని ఎలా వ్యవహరించింది అందరికీ గుర్తుండే ఉంటుంది. ఐదేళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు కాబట్టే మొన్నటి ఎన్నికల్లో చాలామంది ఘోరంగా ఓడిపోయారు. టిడిపి నేతలతో పోల్చుకుంటే మూడు నెలల వైసిపి పాలనలో ఎవరి మీద కూడా అటువంటి ఆరోపణలు లేవు. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఘటనలు కూడా లేవనే చెప్పాలి. కాబట్టి ఆబోతులు ఏ పార్టీలో ఉన్నాయో జనాలకన్నీ తెలుసు.


మరింత సమాచారం తెలుసుకోండి: