పులి వేటాడే ముందు ఒక్క అడుగు వెనక్కి వేసిందంటే అది భయపడి కాదు..బలంగా పంజా విసరడానికి అంటారు.  ఇప్పుడు భారత శాస్త్రవేత్తలు ఇస్త్రో ఎంతో ప్రతిష్టాత్మంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 కేవలవం కొద్ద సమయంలో జాబిలమ్మపై అడుగు పెట్టబోతుందన్న క్షణంలో సాంకేతిక లోపాల కారణంగా ఆగిపోయింది.  విక్రమ్, సెప్టెంబరు 2వ తేదీనాడు విజయవంతంగా చంద్రయాన్ స్పేస్ క్రాఫ్ట్ నుండి విడిపోయింది. చంద్రుడి దక్షిణధ్రువం  పైన రేపు తెల్లవారుఝామున 1.30-2.30గంటల మధ్య దిగనుంది.

ఈ మిషన్ ప్రారంభమైన 48 రోజుల తరువాత ఈ లాండర్, రోవర్లు చంద్రుడిపై దిగనున్నాయి. జులై నెల 22వ తేదీన చంద్రయాన్ ప్రయాణం మొదలైన విషయం మనందరికీ తెలిసిందే. అంతా సంతోష పడుతున్నట్టే  చంద్రుడిపై దిగే ప్రక్రియలో కీలకమైన ఘట్టాన్ని కూడ పూర్తి చేశారు.  కానీ, చంద్రుడికి 2.1కిలో మీటర్ల దూరంలోనే ల్యాండర్ విక్రమ్ నిలిచిపోయింది. ల్యాడర్ విక్రమ్ నుండి సిగ్నల్స్ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ఎదురుచూస్తున్నారు.   ప్రక్రియ సజావుగా సాగుతున్న తరుణంలోనే 300 మీటర్ల దూరంలోనే విక్రమ్ ల్యాండర్ నుండి సిగ్నల్స్ నిలిచిపోయాయి.

చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరంలోనే ఇస్రోకు విక్రమ్ ల్యాండర్ తో సిగ్నల్స్ నిలిచిపోయాయి. కాగా, నిన్న బెంగుళూరులోని ఇస్రో సెంటర్ నుండి ప్రధాని నరేంద్రమోడీతో పాటు దేశ వ్యాప్తంగా ఎంపిక చేయబడిన విద్యార్ధులు  చంద్రయాన్-2 ను ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మెన్ శివన్ ప్రధానికి వివరించారు.

ఆ సమయంలో ఆయన కంట కన్నీరు కనిపించగా..వెంటనే లేచి ప్రధాని మోదీ ఆలింగనం చేసుకొని ఇది మన నైతిక విజయం. అక్కడకు చేరుకోవడమే మన విజయం అని ధైర్యం చెప్పారు. ఇది భవిష్యత్ ప్రయోగాలకు పునాది..మీరు సాధించింది తక్కువేమీ కాదు..ఇదే స్ఫూర్తితో వెళ్లాలని ప్రధాని మోడీ శాస్త్రవేత్తలకు సూచించారు.  మీ వెంటన 128 కోట్ల మంది ప్రజలు, వారి ఆశిస్సులు, ప్రేమాభిమానాలు ఉన్నాయి అని మనోధైర్యం చెప్పారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: