బాబు ... డ్రామాలు చాలు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు   డ్రామాలను నమ్మేవారు ఎవరు లేరని ఇక నాటకాలు చాలించాలని ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి అన్నారు.   ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి వంద రోజుల పాలన పై మాట్లాడుతూ శ్రీ పుష్ప శ్రీ వాణి, చంద్రబాబు నాయుడికి  ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే అంత విషయం లేదని, వంద రోజుల్లోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మరెన్నో పాలనాపరమైన సంస్కరణలను చేపట్టిన ఘనత జననేత జగన్మోహన్ రెడ్డి గారి సొంతం అని అన్నారు.

శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి వంద రోజుల జనరంజకమైన పాలన  చూసి తట్టుకోలేని చంద్రబాబు నాయుడు గారు అక్కసుతో కొత్త నాటకాలకు తెర తీశారని  శ్రీ పుష్ప శ్రీ వాణి అన్నారు. ప్రజలు ఇప్పుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాటకాలను, మరియు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి  ఇ పాలనాదక్షత ల మధ్య వ్యత్యాసం గుర్తించారని శ్రీ పుష్ప శ్రీ వాణి చెప్పారు.

పునరావాస కేంద్రాల పేరుతో డ్రామాలాడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఎమ్మార్వో వనజాక్షి  పై చింతమనేని ప్రభాకర్ చేయి చేసుకున్నప్పుడు ఎక్కడున్నారు అని శ్రీ పుష్ప శ్రీ వాణి అడిగారు.నారాయణ కాలేజీలో 25 మంది ఆడపిల్లలు చనిపోయినప్పుడు పునరావాస కేంద్రాలు పెట్టాలని గుర్తు రాలేదా అని ఆమె ప్రశ్నించారు.

చంద్రబాబునాయుడు గారు ఇకనైనా కళ్ళు తెరిచి  అసత్య ప్రచారాలు మానుకోవాలని, అవన్నీ నమ్మే స్థితిలో  ఇప్పుడు ప్రజలు లేరని ఉపముఖ్యమంత్రి చెప్పారు. శతాబ్దాల తరబడి  అవ్వ లేవు అనుకున్న పనులను ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు  వంద రోజులు పూర్తి చేసిన విషయం గుర్తెరిగి మసలు కోవాలని హితవు పలికారు  



మరింత సమాచారం తెలుసుకోండి: