ఏపీలో మూడు నెలల క్రితం అధికారం మారిన తర్వాత.. రాజధాని అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గత చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతానని చెప్పుకొచ్చింది. కానీ ఆ దిశగా పెద్దగా జరిగిందేమీ లేదు. లేకపోగా.. వేల కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించింది. 


చంద్రబాబు సర్కారు పోయిన జగన్ సర్కారు వచ్చాక.. ఆ ప్రాజెక్టుల్లో అవినీతిపై దర్యాప్తు మొదలైంది. రాజధాని మారుతుందన్న కోణంలో మంత్రులు మాట్లాడటం మొదలుపెట్టారు. దీంతో ప్రతిపక్షాలు ప్రధానంగా టీడీపీ, జనసేన కస్సు మంటున్నాయి. రాజధాని మారిస్తే ఊరుకునేది లేదంటున్నాయి. అంత వరకూ బాగానే ఉంది. 
కానీ ఇక్కడే ఓ సంచలన విషయం బయటపడింది. చంద్రబాబు అమరావతిని రాజధానిగా  ప్రకటించినా.. రాజధాని అమరావతి అని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. అంటే.. దీనికి అర్థం ఆంధ్రప్రదేశ్ కి ఇంకా రాజధాని లేదు అని... ఈ పాయింట్ తో కావాలి అంటే రాజధాని మార్చుకోవచ్చు. 


మరి చంద్రబాబు.. గజిట్, నోటిఫికేషన్ లేకుండా  అమరావతి మీద బాబు అంతఖర్చు ఎలా చేయగలిగేడు ?న్యాయపరంగా చూస్తే చేసిన ఖర్చంతా  తిరిగి రాబట్టవలసినదే ! అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అదీ గాక చంద్రబాబు.. తన హాయంలో కట్టినవన్నీ తాత్కాలిక భవనాలే తప్ప ఒక్కటీ శాశ్వత భవనం కాదు.. అంటే ఏ ఉద్దేశ్యంతో చంద్రబాబు ఇలాంటి పని చేశాడని ఇప్పుడు వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. 


మరోవైపు చంద్రబాబు తెలివితక్కువ తనాన్ని టీడీపీ నాయకులు కూడా తమ అంతర్గత సంభాషణల్లో తప్పుబడుతున్నారు. 40 ఏళ్ల సీనియారిటీ అని చెప్పుకునే చంద్రబాబు గెజిట్ నోటిఫికేషన్ ఇందుకు ఇచ్చుకోలేకపోయారు.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు... అనుభవం అనుభవం అని చెప్పుకునే నేత ఇంత సింపుల్ గా వైసీపీకి ఎలా బుక్కయ్యారు..అని తలలు పట్టుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: