అతడో స్వాతంత్ర సమరయోధుడు.అందరి దృష్టిలో ఓ హీరో.అందుకే అతన్నినమ్మి అధికారం కట్టబెట్టారు.అయితే,తాను పైకి మాత్రమే కనిపించే హీరో,మరో కోణంలో కనబడని అతని సామ్రాజ్యానికి విలన్ అని నిరూపించడానికి ఎంతో సమయం పట్టలేదు.అధికార దాహంతో ప్రతిపక్షమే లేకుండా చేయాలనుకున్నా డు.తనని ఎదిరించే వారికి సింహస్వప్నం అయ్యాడు.వాళ్లను అత్యంత దారుణంగా చంపి 37 ఏళ్లు తిరుగులేని నేతగా ఎదిగాడు.చేయరాని పనులు చేసి ప్రజలను కిరాతంగా హతమార్చాడు చివరికి సొంతవారే ఆయనపై తిరగబడే పరిస్థితిని కల్పించుకుని,సైనిక తిరుగుబాటుతో పదవీచ్యుతుడైయ్యాడు కానీ, అప్పటికే ఆ దేశానికి జరగకూడని నష్టం జరిగిపోయింది..అతడు మరెవ్వరో కాదు,జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే.



జింబాబ్వేకు స్వాతంత్రం లభించిన తర్వాత ఆ దేశానికి తొలితరం నాయకుడిగా ఎన్నికయ్యారు.దాదాపు మూడు దశాబ్దాలపాటు జింబాబ్వేను పరిపాలించిన ముగాబే 2017 నవంబర్‌లో సైనిక చర్య ద్వారా పదవీచ్యుతుడు అయ్యారు.ఇతనికి ప్రతిపక్షం అంటే అస్సలు ఇష్టం ఉండదు ముగాబే అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో మంచి పాలన అందించారు.అయితే, క్రమేనా ఆయనలో నియంత నిద్రలేచాడు.పాలన కాలం పెరిగే కొలది లోపాలు కూడా బయటపడతాయి.ఆ సమయంలో ఎవరైనా వాటిని వేలెత్తి చూపడం అతనికి అస్సలు ఇష్టం ఉండేది కాదు.అందుకే వాళ్లని అంతం చేసేవరకు నిద్రపోయేవారు కాదట.ఒక గానొక దశలో అంటే 1980 నుంచి 2017 వరకు జింబాబ్వే రాజకీయాలను ఆయనే శాసించారు.మెజార్టీ నల్ల జాతీయులకు విద్య,వైద్య సదుపాయాలను మెరుగుపర్చిన వ్యక్తిగా కూడా ప్రజల్లో నిలిచాడు.అయితే,ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే.వాస్తవానికి ముగాబే ఓ నియంత.



ఒకగానొక సమయంలో జింబాబ్వేలో ఆర్థిక సంక్షోభం ఏర్పడటానికి కారణం ముగాబే తీసుకున్న పనికిరాని నిర్ణయం వల్ల ఆ దేశంలో విద్యుత్ సదుపాయం నిలిచిపోయి,ప్రజలకు కనీసం ఔషదాలు కూడా దొరకని పరిస్థితి నెలకొంది.కానీ, అమాయక ప్రజలు ఆయన్ని గొప్ప నాయకుడని నమ్మారు కాబట్టి ఏ రోజు నిందించే ప్రయత్నం గాని సాహసం గాని చేయలేదు అందుకే అతని ఆటలు సాగాయి.ఇక ముగాబే చేసిన దారుణాలు భయంకరంగా వున్నాయట.అతన్ని ఎవరైన ఎదిరిస్తే బతుకుపై ఆశలు వదిలేసుకోవల్సిందేనట దానికి నిదర్శనంగా 2008లో సుమారు 300 మందిని సామూహికంగా చంపేశారని చెబుతారు.ఇక ఆయన అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే 20వేల మంది పౌరులను చంపేశాడని అంటున్నారు.అంతే కాకుండా ఈ భూలోకాన్నే నరకంగా మార్చాడు. ముగాబే రాజకీయ శత్రువు జాషువా న్కోమోకు మద్దతు తెలిపిన వేలాది మందిని 1980లో సామూహికంగా హత్య చేయించడమే కాకుండా ఫిఫ్త్ బ్రిడ్జ్ ప్రాంతంలోని సైనిక శిక్షణ కేంద్రంలో 20 వేల మంది ముగాబే వ్యతిరేకులను,బంధించి,వారిని గుడిసెల్లో పెట్టి బతికుండగానే నిప్పుపెట్టి చంపేయగా,ఇంకొందరిని బహిరంగంగా ఉరి తీసి,మరికొందరిని తుపాకీలతో కాల్చి చంపాడు.



ఇతని చేతికి చిక్కిన వాళ్లను రాక్షసంగా హింసిస్తూ,వారి సమాధులు వారినే తవ్వుకొమ్మని చెప్పి,బతికి ఉండగానే వాళ్లను ఆ గోతుల్లో పూడ్చి సజీవ సమాధి చేసేవాడట.ముగాబే పాలన వెనకున్న ఈ కిరాతక చర్య సాధారణ ప్రజలకు తెలియకుండా రహస్యంగా జరిగేది.దీంతో ప్రజలంతా ముగాబేను మంచి పాలకుడుగానే భావించేవారు.ఇక ప్రతిపక్ష నేతలు మాత్రం అతడిపై ఆరోపణలు చేయడానికే భయపడేవారు.ఫలితంగా అతడు 37 ఏళ్లపాటు అధికారంలో కొనసాగాడు.1980 నుంచి 1985 మధ్య ముగాబే పాలనకు వ్యతిరేకంగా పోరాడిన పదివేల మంది నిరసనకారులను సైనికులు హత్య చేశారు.కాలంతోపాటే ముగాబే రహస్య హత్యలు కూడా వెలుగులోకి వచ్చాయి.కానీ,జింబాబ్వే ప్రజలకు అతడు తప్ప మరో ప్రత్యామ్నయ నాయకుడు దిక్కులేడు.



అందుకే అతని ఆటలు సాగాయి.2010లో ముగాబేకు క్యాన్సర్ వ్యాధి సోకింది.అయినా అతనిలో ఆత్మవిశ్వాసం,అహంకారం అలాగే ఉంది.ఇక అతడి నియంత్రత్వ దోరణికి ముగాబే రెండో భార్య గ్రేస్ తోడైంది.జల్సాలను ఇష్టపడే ఆమె ప్రభుత్వ నిధులను విచ్చలవిడిగా తన అవసరాలకు ఖర్చు చేసుకొనేది. దీంతో క్రమేనా ప్రజా వ్యతిరేకత పెరిగి 2017లో సైనికులు అతడిని చుట్టుముట్టి గృహ నిర్బంధం చేశారు.ఆ తర్వాత ముగాబే చాలా రోజులు వీల్ చైర్‌లో కనిపించారు.తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చెడ్డవానిగా మరణించాడు.ఇలాంటి దుష్టచర్యలు,కిరాతకపు పనులు అతని మరణాంతం కూడా అతన్ని వీడకుండా అతన్నొక నీచుడిగా పేర్కొంటున్నాయి.మనిషనే వాడు ఎలా బ్రతక కూడదో ముగాబే నిరూపించాడని ఇప్పుడు అక్కడి ప్రజలు అనుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: