వైకాపా వంద రోజుల పాలన హత్యలూ కబ్జాల మయంగా ఉందని తెలుగు దేశం నేత అఖిలప్రియ విమర్శించారు. గుంటూరు లోని అరండల్ పేటలో ఏర్పాటు చేసిన వైకాపా బాధితుల శిబిరాన్ని తెలుగు దేశం పార్టీ నేతలు సందర్శించారు. పల్నాడు బాధితులను పరామర్శించి వారి తో మాట్లాడారు బాధితు లు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయ లేదని చెప్పారు. దీన్ని రాజకీయ కోణం లో చూడొద్దని శాంతి భద్రతల కోణం లో చూసి పోలీసులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ కోరారు.


" హత్యలతోటి రౌడీయిజం గూండాయిజం ఆస్తులు ధ్వంసం చేయడం తప్పుడు కేసులు పెట్టడాలు చంపడాలు ఈ విధంగా సాగింది వంద రోజుల పరిపాలన. ఎస్సీల మీద బీసీల మీద మైనారిటీల మీద మహిళల పైన ప్రతి ఒక్కరి మీద కూడా ఈ రోజు దాడులు చేస్తున్నారు. ఈ తుగ్లక్ పాలన చేస్తున్నారని చెప్పేది మేము కాదు తెలుగు దేశం పార్టీ  నాయకులే గాక చెప్పేది స్వయాన ప్రజలు చెప్తున్నారు. కక్ష సాధించడానికే అధికారం లోకి వచ్చినట్టు ఉంది కానీ ఎక్కడ కూడా ప్రజలకీ మేలు చేద్దామన్న  ఆలోచన లో ఏ ఒక్క నాయకుడు కూడా లేదని చెప్పి రోజు వాళ్లే నిరూపిస్తున్నారు. చనిపోతే చూడడానికి వెళ్లాలంటే కూడా భయ పడుతున్న పరిస్థితి కనిపిస్తుందంటే ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి "   అని అఖిల ప్రియ ఘాటు విమర్శలు చేశారు. 

"ప్రభుత్వం లో ఉందు మీరు ప్రభుత్వం నడపాల్సింది మీరు,వాళ్ల రక్షణ కోసం ఇక్కడుంటే వీళ్ల విషయం రాష్ట్ర మంతా చర్చ జరుగుతుంటే తాను డైవర్ట్ చెయ్యటానికి మేం కూడా బాధితులం అని చెప్పి చెప్పడం అనేది ఒక దివాళాకోరు రాజకీయం మీకు పాలన చేతకాకపోతే చేతగాదు అని చెప్పి డిక్లేర్ చేయండగానీ ఇలాంటి చౌకబారు ప్రచారాన్ని పూనుకోవద్దని వైసిపి ప్రభుత్వాని కి నేను  విజ్ఞప్తి చేస్తున్నా. పోలీస్ వారు కూడా దీన్ని ఒక  లా అండ్ ఆర్డర్ విషయంగా చూసి శాంతి భద్రతల ప్రరిరక్షిండి కానీ దీన్ని రాజకీయ కోణం లో చూసి అధికార పార్టీ కి అనుకూలం గా వ్యవహరించాలి అని అనుకోవద్దని చెప్పి వాళ్ల కు నేను విజ్ఞప్తి చేస్తున్నా  " అని డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: